News September 19, 2025

HYD: BRS జైత్రయాత్రతో కాంగ్రెస్‌కు చెక్ పెట్టాలి: KTR

image

420 హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌కు జూబ్లీహిల్స్ BRS జైత్రయాత్రతో ప్రజలు చెక్ పెట్టాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. శుక్రవారం HYD తెలంగాణ భవన్‌లో ఎర్రగడ్డ డివిజన్‌కు చెందిన బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ సమావేశం అయ్యారు. కాంగ్రెస్, బీజేపీల జాయింట్ వెంచర్ రేవంత్ సర్కార్ అని ఎద్దేవా చేశారు. పొరపాటున కాంగ్రెస్‌ను గెలిపిస్తే సంక్షేమ పథకాలు అమలుకావని స్పష్టం చేశారు.

Similar News

News September 20, 2025

తెలుగు రాష్ట్రాల న్యూస్ రౌండప్

image

* నో ఫ్లై జోన్‌గా TG సెక్రటేరియట్‌‌.. ప్రకటించిన ప్రభుత్వం. చుట్టూ సైన్ బోర్డుల ఏర్పాటుకు ఆదేశం.
* TG PGEC/TS PGECET-2025 చివరి విడత షెడ్యూల్ విడుదల. ఈనెల 20-25 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, 28-30 వరకు వెబ్ ఆప్షన్స్‌కు అవకాశం.
* విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈనెల 23న గం.10AM నుంచి గ్రూప్-2 అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్: APPSC
* పల్నాడు(D) మాచర్లలో రేపు CM చంద్రబాబు పర్యటన.

News September 20, 2025

వికారాబాద్: కేటగిరీల వారీగా ఓటర్ల వివరాలు అందించాలి: కలెక్టర్

image

జిల్లాలోని ఓటర్ల వివరాలను కేటగిరీల వారీగా సమర్పించాలని అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం వికారాబాద్ కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటర్ల జాబితా నివేదికను వెంటనే తయారుచేయాలని సూచించారు. ఈ నివేదికను ఎన్నికల కమిషన్‌కు పంపిస్తామని ఆయన తెలిపారు.

News September 20, 2025

రేపు పేరుపాలెం బీచ్ క్లీనింగ్ క్యాంపెయిన్: కలెక్టర్

image

మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌లో శనివారం బీచ్ క్లీనింగ్ క్యాంపెయిన్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ తీరప్రాంత మిషన్ పథకం కింద సెప్టెంబర్ 20న అంతర్జాతీయ తీరప్రాంత శుభ్రపరిచే దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.