News March 7, 2025

HYD: BRS లీడర్ ఇంట్లో విషాదం!

image

HYD శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసుల వివరాలు.. HYD శివారులోని గొల్లపల్లి కలాన్ వద్ద ఓఆర్ఆర్‌పై లారీ కిందకు కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కనిష్క్(20) మలక్‌పేట యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కనిష్క్ మూసారాంబాగ్ BRS మాజీ కార్పొరేటర్ తీగల సునరిత, అజిత్ రెడ్డి కుమారుడు. తీగల కృష్ణారెడ్డి బంధువులు అని సమాచారం.

Similar News

News February 1, 2026

2026-27 బడ్జెట్ స్పీచ్

image

*సెమీ కండక్టర్ 2.0 మిషన్ ప్రకటన.. సప్లై, రీసెర్చ్&ట్రైనింగ్‌పై ఫోకస్ కోసం రూ.40వేల కోట్లు కేటాయింపు
*బయో ఫార్మా మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్ కోసం రూ.10,000 కోట్లు
*దేశంలో కొత్తగా 3 NIPERలు
*ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, తమిళనాడుకు రేర్ ఎర్త్ ప్యాకేజీ
*ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కేటాయింపులు రూ.40వేల కోట్లకు పెంపు

News February 1, 2026

పద్దు డిసైడ్ చేసేది వీళ్లే

image

కేంద్ర బడ్జెట్‌ వెనుక ఓ పెద్ద టీమ్ వర్కే ఉంటుంది. ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ అనురాధా ఠాకూర్‌, రెవెన్యూ సెక్రటరీ అరవింద్ శ్రీవాస్తవ, ఎక్స్‌పెండిచర్ సెక్రటరీ వి.వుయల్నామ్, ఆర్థిక సేవల కార్యదర్శి నాగరాజు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్ సెక్రటరీ ఆరునిష్ ఛావ్లా, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సెక్రటరీ కే మోసస్, ముఖ్య ఆర్థిక సలహాదారు వీ అనంత్ నాగేశ్వరన్ ఈసారి బడ్జెట్‌‌లో కీలక పాత్ర పోషించారు.

News February 1, 2026

LIVE: లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న నిర్మల

image

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెడుతున్నారు. పైన ఉన్న ప్లే బటన్ నొక్కి LIVE చూడొచ్చు.