News September 14, 2025

HYD: ‘BRS విష ప్రచారాలను తిప్పి కొట్టాలి’

image

గ్రూప్-1 పరీక్షపై BRS చేస్తున్న విష ప్రచారాలను ప్రతీ కాంగ్రెస్ కార్యకర్తల తిప్పికొట్టాలని రాష్ట గ్రంథాలయ ఛైర్మన్ రియాజ్ పిలుపునిచ్చారు. హైకోర్ట్ తీర్పును తాము ఎల్లప్పుడూ గౌరవిస్తామని స్పష్టంచేశారు. గ్రూప్-1 పోస్టులు అమ్ముకున్నారని మాట్లాడిన KTRపై చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను కోరారు. అసత్య ప్రచారాలు మానుకోవాలని BRS నాయకులకు హితవు పలికారు.

Similar News

News September 14, 2025

విజయవాడ: పండుగ వేళ ప్రత్యేక రైళ్లు

image

దసరా, దీపావళి సందర్భంగా విజయవాడ మీదుగా చెన్నై సెంట్రల్(MAS), బరౌని(BJU) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం.06039 MAS-BJU ట్రైన్‌ను నేటి నుంచి NOV 30 వరకు ప్రతి ఆదివారం, నం.06040 BJU-MAS ట్రైన్‌ను SEPT 17 నుంచి DEC 3 వరకు ప్రతి బుధవారం నడుపుతామన్నారు. ఈ ట్రైన్లు ఏపీలో విజయవాడ, శ్రీకాకుళం రోడ్, విజయనగరం, రాజమండ్రితో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.

News September 14, 2025

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను మోదీ ఆదుకుంటున్నారు: మాధవ్

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను వాజపేయి ఆదుకున్నట్టే నేడు మోదీ ఆదుకుంటున్నారని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పేర్కొన్నారు. సారథ్యం యాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడారు. అమెరికా టారిఫ్‌లతో ఏపీలో పలు వర్గాలు నష్టపోతున్నాయని, ఆత్మనిర్భర్ భారత్ దీన్ని పరిష్కరించగలదని పేర్కొన్నారు. స్వదేశీ ఉద్యమాన్ని ఏపీ బీజేపీ ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. బీజేపీని ఇంటింటికి విస్తరించడమే తన లక్ష్యంగా చెప్పుకొచ్చారు.

News September 14, 2025

టీటీడీ ఛైర్మన్‌ను కలిసిన తిరపతి కొత్త SP

image

తిరుమలలో ఆదివారం టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును నూతన ఎస్పీ సుబ్బారాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బాధ్యతగా విధులు నిర్వర్తించాలని బీఆర్ నాయుడు SP సుబ్బారాయుడుకు సూచించారు. అనంతరం ఆయన్ను అభినందిస్తూ రానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై చర్చించారు.