News March 19, 2024
HYD: ‘CM రేవంత్‌రెడ్డి సార్ మా నాన్నను కాపాడండి’

HYD తుక్కుగూడలో 2023 SEP 17న సోనియాగాంధీ జనగర్జన సభకు వచ్చిన సూర్యాపేట జిల్లా వాసి కొమ్ము భిక్షం.. తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో హయత్‌నగర్ పరిధిలో రోడ్డు ప్రమాదానికి గురై గాయాల పాలయ్యాడు. ప్రస్తుతం తన తండ్రి ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, తమ పరిస్థితి దయనీయంగా ఉందని కుమారుడు కొమ్ము శ్రీకాంత్ కన్నీరు పెడుతున్నారు. సర్జరీకి రూ.లక్షల్లో ఖర్చవుతుందని, సీఎం ఆదుకోవాలని కోరుతున్నారు.
Similar News
News November 28, 2025
HYD: మెగా కార్పోరేషన్‌గా జీహెచ్ఎంసీ

ఔటర్ రింగ్ రోడ్డు పరిధి వరకు ఉన్న మున్సిపాలిటీల విలీనంతో GHMC మెగా కార్పోరేషన్‌గా అవతరించింది. కాగా కార్పోరేషన్‌ను 2 లేదా 3గా విభజించాలనే ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ ఎన్ని ముక్కలుగా విభజించాలనే అంశంపై త్వరలో స్పష్టత రానుంది. సంస్థాగత పునర్విభజన, కార్పొరేషన్ బట్టి ఉన్నందున ప్రభుత్వం నుంచి వచ్చే స్పందనకు అనుగుణంగా వీటిపై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తుందని టాక్.
News November 28, 2025
HYD: గడువు ముగిసిన తర్వాతే ‘విలీనం’ !

జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలను విలీనం చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నా ఇందుకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ప్రస్తుత గ్రేటర్ పాలక మండలి గడువు ఫిబ్రవరి 10 వరకు ఉంది. ఈ గడువు ముగిసిన తరువాతే సర్కారు జీఓను విడుదల చేయనున్నట్లు సమాచారం. విలీన నిర్ణయాన్ని పాలక మండలి ఆమోదించినా భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండేందుకే ఈ ఆలస్యం చేయనున్నట్లు తెలిసింది.
News November 28, 2025
HYD: సామన్లు సర్దుకున్న పెద్దాయన!

కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో అక్రమాలకు పాల్పడిన పెద్దాయన సామన్లు సర్దుకున్నట్లు టాక్. హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలోని విలువైన వస్తువులను, ఫర్నిచర్లను తన ఇంటికి తరలించారు. అక్ర‘మార్కుల’ కేసులో వేటు తప్పదనే ఉద్దేశ్యంతో తన క్యాంపు కార్యాలయాల్లోని సామగ్రిని గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారని సమాచారం.


