News April 2, 2025
HYD: CM రేవంత్ రెడ్డికి రాజాసింగ్ లేఖ

శ్రీరామనవమి శోభాయాత్రకు ఎటువంటి పరిమితులు లేకుండా అనుమతించాలని BJP ఎమ్మెల్యే రాజాసింగ్ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. 15 ఏళ్లుగా శాంతియుతంగా నిర్వహిస్తున్న యాత్రకు పోలీసులు శబ్ద నియంత్రణ పేరుతో ఆంక్షలు వేస్తున్నారని ఆయన ఆక్షేపించారు. ఇతర మతాలకు ఇలా ఆంక్షలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. యాత్రను నిర్బంధం లేకుండా నిర్వహించేందుకు అనుమతివ్వాలని కోరారు.
Similar News
News April 4, 2025
IIT హైదరాబాద్‌కు విరాళమిస్తే నో టాక్స్

ప్రముఖ విద్యాసంస్థ ఐఐటీ హైదరాబాద్‌కు విరాళమిచ్చే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది. ఈ విద్యా సంస్థకు విరాళం ఇస్తే ఆ మొత్తానికి సంబంధించి టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. గతంలో 50% పన్ను చెల్లించాల్సి ఉండేది. అయితే ఇపుడు ఐటీ యాక్ట్ సెక్షన్ 80జీ ప్రకారం విరాళాలు టాక్స్ ఫ్రీ అని ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొ.బీఎస్ మూర్తి తెలిపారు.
News April 4, 2025
HYD: చారిత్రాత్మక కట్టడాలు.. చెత్తతో స్వాగతాలు

చారిత్రాత్మక కట్టడాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. అధికారుల అలసత్వం, క్రమశిక్షణ లేని జనం మూలంగా మురికి కూపంలా మారుతున్నాయి. అందుకు నిదర్శనం పాతబస్తీలోని గుల్జార్ హౌజ్ వద్ద ఉన్న వాటర్ ఫౌంటెన్. సందర్శకులను ఎంతగానో అలరించిన నిజాంకాలం నాటి ఫౌంటెన్ వద్ద నేడు శుభ్రత కరవైంది. మంచినీటికి బదులు మురికి నీరు దాని నిండా ఖాళీ వాటర్ బాటిల్స్, చెత్త చెదారంతో స్వాగతం పలుకుతున్నాయి.
News April 4, 2025
IIT హదరాబాద్‌కు విరాళమిస్తే నో టాక్స్