News September 14, 2024
HYD: CM రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ..!
✓చర్లపల్లి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల నుంచి స్టేషన్ చేరుకునే అప్రోచ్ రోడ్లను అభివృద్ధి చేయాలి.
✓చర్లపల్లి పరిసర అటవీ శాఖ, పరిశ్రమల విభాగాల భూములు స్వాధీనం చేసుకోవాలి.
✓చర్లపల్లిలో పలు పరిశ్రమలను వేరే ప్రాంతానికి తరలించాలి.
✓మూసి డెవలప్మెంట్‌పై ఫోకస్ పెట్టి, బాధిత నిర్వాసితులకు భరోసా కల్పించాలి.
✓ఇంటింటికి చెత్త సేకరణ కోసం వీలైతే GIS, QR కోడ్ స్కానింగ్ సాంకేతికత ఉపయోగించండి.
Similar News
News October 13, 2024
హైదరాబాద్: PHOTO OF THE DAY
రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలను ఏకం చేసిన గొప్ప కార్యక్రమం అలయ్ బలయ్ అని CM రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం నాంపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రేవంత్ రెడ్డికి స్వాగతం పలుకుతూ హర్యానా గవర్నర్ బండారు దత్రాత్రేయ ఆలింగనం చేసుకున్నారు. అయితే, ఒకే వేదిక మీద రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, HYD BRS MLAలు ఉండడంతో PHOTO OF THE DAYగా నిలిచింది. అలయ్.. బలయ్ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకొంది.
News October 12, 2024
HYD: ఉప్పల్ వెళ్తున్నారా.. వీటికి నో ఎంట్రీ!
HYD ఉప్పల్ స్టేడియంలో మరికాసేపట్లో T20 క్రికెట్ మ్యాచ్ జరగనుంది. స్టేడియంలోకి కెమెరా, రికార్డింగ్ పరికరాలకు అనుమతి లేదు. హెడ్ ఫోన్స్, ఇయర్ ప్యాడ్స్, సిగరెట్, అగ్గిపెట్టె, కత్తి, తుపాకీ, కూల్ డ్రింక్స్, పెంపుడు జంతువులు, తినుబండారాలు, బ్యాగులు, ల్యాప్ టాప్, సెల్ఫీ స్టిక్, హెల్మెట్ టపాకాయలు, డ్రగ్స్, సిరంజి, వైద్య పరికరాలు నిషేధమని ఉప్పల్ ట్రాఫిక్ సీఐ లక్ష్మీ మాధవి తెలిపారు.
SHARE IT
News October 12, 2024
హైదరాబాద్‌లో వైన్స్ షాపులకు పోటెత్తారు..!
దసరా నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లోని వైన్స్ షాపులకు మందుబాబులు పోటెత్తారు. ఏ వైన్స్ ముందు చూసినా రద్దీగా కనపడుతోంది. పండుగకు సొంతూరికి వచ్చిన వారితో పల్లెలన్నీ కళకళలాడుతున్నాయి. హైదరాబాద్‌లోని పలు చోట్ల షాపులు తెరవకముందే క్యూ కట్టిన దృశ్యాలు కనిపించాయి.
NOTE: మద్యం తాగి వాహనాలు నడపకండి.