News March 1, 2026
HYD: ‘CM కాలి గోటికి కూడా KTR, హరీశ్ సరిపోరు’

KTR, హరీశ్‌రావు ఇద్దరు కలిసినా రేవంత్ రెడ్డి కాలి గోటికి సరిపోరని కాంగ్రెస్ నేత మెట్టు సాయికుమార్ విమర్శించారు. ఆదివారం గాంధీ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. అధికారం పోగానే గుంటనక్క KTR సాధు జంతువు అయ్యారా అని ప్రశ్నించారు. గత 10 ఏళ్లలో నగరంలోని పలు ప్రాంతాలను కబ్జాలు చేసింది మీరు కాదా అని మండిపడ్డారు. BRS లాంటి నీచరాజకీయాలు కాంగ్రెస్ చేయదని వ్యాఖ్యానించారు.
Similar News
News March 3, 2026
నెల్లూరు: స్పెషల్ డ్రైవ్ పెడుతున్నా.. శృతి మించుతున్నారు

జిల్లాలో పోలీసులు ఎప్పటికప్పుడు నాకా బందీలు చేపడుతున్నా.. ఎక్కడికక్కడ శృతి మించుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇటీవల చేపట్టిన పలు సందర్బల్లో కేసులు నమోదయ్యాయి. ఇందులో భాగంగా.. 57 లాడ్జిలను, 1694 వాహనాలను తనిఖీ చేయగా.. 20 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. డ్రోన్ కెమెరాల పర్యవేక్షణతో 28 మంది పట్టుబడ్డారు. నిభందనలు పాటించనివారిపై 157 కేసులు నమోదు చేశారు. రూ. 1.52 లక్షలు జరిమానా విధించారు.
News March 2, 2026
కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

* కృష్ణా యూనివర్సిటీ MBA/MCA పరీక్షల షెడ్యూల్ విడుదల
* కొడాలి నానిపై గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఫైర్
* కృష్ణాలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షకు 255 మంది గైర్హాజరు
* కృష్ణా జిల్లా వ్యాప్తంగా బాణాసంచా దుకాణాల్లో తనిఖీలు
* విజయవాడలో ప్రాణం తీసిన సెల్ఫీ
* గన్నవరంలో గరికపాటి వ్యాఖ్యలపై కమలానంద భారతి అభ్యంతరం
News March 2, 2026
కామారెడ్డి: ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి: ఎమ్మెల్యే

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పదవి విరమణ పొందిన ఉద్యోగుల సమస్యల పరిష్కారించాలని సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ధర్నాచౌక్‌లో కామారెడ్డి MLA కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వం దిగి వచ్చి ఉద్యోగుల పెండింగ్ సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ MP DK అరుణ ఎమ్మెల్యే దీక్షను విరమింపజేశారు.


