News December 10, 2025
HYD: CM సాబ్.. జర దేఖోనా!

నేడు CM రేవంత్ OUకు వస్తున్నారు. దీంతో విద్యార్థి సంఘాల నాయకులు CM ముందు పలు డిమాండ్లు ప్రస్తవించారు. క్యాంపస్‌కు రూ.1000 కోట్లు, వర్సిటీ భూములను పరిరక్షించాలి, PHD విద్యార్థులకు రూ.20,000, ప్రతి విద్యార్థికి రూ.50,000 ఫెలోషిప్, హాస్టల్‌లోని మెస్‌లలో నాణ్యమైన భోజనం, స్కిల్ సెంటర్ ఏర్పాటు, విద్యార్థి సంఘాలపై నిర్భంధాలు ఎత్తివేయాలి, ఓయూ PSను క్యాంపస్ నుంచి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.
Similar News
News March 17, 2026
11,127 ఉద్యోగాలకు నోటిఫికేషన్

రైల్వేలో 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ వెలువడింది. మే 15 నుంచి జూన్ 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్, సంబంధిత విభాగంలో ITI/డిప్లొమా ఉత్తీర్ణత, 18-30 ఏళ్ల వయసున్న వారు అర్హులు. రిజర్వేషన్‌ను బట్టి ఏజ్‌లో సడలింపు ఉంటుంది. CBT 1, CBT 2, CBAT, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://indianrailways.gov.in/
News March 17, 2026
అవినీతి ఆరోపణలపై కడప కార్పొరేషన్ ఇంజినీర్ల పెన్షన్లలో కోత

కడప మున్సిపల్ కార్పొరేషన్లో ఇంజినీరింగ్ విభాగంలో జరిగిన అవినీతి, అక్రమాలపై ముగ్గురు రిటైడ్ ఇంజినీర్ల పెన్షన్లలో కోత విధిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ACB ఫిర్యాదుపై విచారణ జరిపిన ప్రభుత్వం పదవీ విరమణ చేసిన ఇంజినీర్లు శ్రీనివాసులు, దస్తగిరి రెడ్డి, దౌలాకు వారి పెన్షన్లో 5 శాతం కోత విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. పనులను విభజించి, నామినేషన్‌పై కట్టబెట్టడంపై చర్యలు తీసుకున్నారు.
News March 17, 2026
నిర్మల్: కల్లెడలో 10 శతాబ్దం ఆలయం గుర్తింపు!

నిర్మల్ జిల్లా కడెం మండలం కల్లెడలో 10వ శతాబ్దానికి చెందిన పురాతన ఆలయాన్ని చరిత్ర పరిశోధకుడు కరిపె రాజ్ కుమార్ గుర్తించారు. స్థానిక మల్లన్న ఆలయంలో చాళుక్య శైలిలో ఉన్న అద్భుతమైన రాతి స్తంభాలు, ద్వారపాలకులు, త్రిశూలం, గద ఆకృతులు వెలుగుచూశాయి. ఈ అరుదైన చారిత్రక సంపదను ప్రభుత్వం వెంటనే గుర్తించి కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.


