News October 20, 2024
HYD: CM రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సూటి ప్రశ్న.!
మూసీ అంశం పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి సూటి ప్రశ్న సందించారు. మూసిలోకి వచ్చే డ్రైనేజీ డైవర్ట్ చేయకుండా మూసి బ్యూటిఫికేషన్ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. హైదరాబాద్ సిటీలోని శామీర్పేట, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి తదితర ప్రాంతాల డ్రైనేజీ నీరు డైరెక్ట్ మూసిలో కలుస్తుందని. GHMC, జలమండలి మూసిలోకి డ్రైనేజీ పైప్ లైన్లు వేసిందని తెలిపారు.
Similar News
News January 3, 2025
HYD: 100 కుటుంబాలే 31 వేల ట్యాంకర్లు బుక్ చేశాయి!
గ్రేటర్ హైదరాబాద్‌లో 2024లో 6 డివిజన్లలో 20 సెక్షన్ల నుంచి అత్యధికంగా ట్యాంకర్లు బుక్ అయ్యాయని ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. గత వేసవిలో 100 కుటుంబాలు 31,000 ట్రిప్పులు బుక్ చేయగా, 40,000 కుటుంబాలు 70% ట్యాంకర్లు వినియోగించుకున్నాయి. సర్వే ప్రకారం, 18,000 కుటుంబాలకు ఇంకుడు గుంతలు ఉన్నాయి. నీటి కొరత కారణాలు గుర్తించి పరిష్కారాలు సూచించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
News January 3, 2025
GHMC: జలమండలి ఫిర్యాదుల్లో 60% అవే..!
గ్రేటర్ హైదరాబాద్‌లో జలమండలి ఫిర్యాదులపై విశ్లేషణ జరిపామని ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. స్పెషల్ డ్రైవ్ పకడ్బందీగా అమలు చేసేందుకు నిర్వహించిన మూడేళ్ల విశ్లేషణపై రిజల్ట్ వివరించారు. ప్రధానంగా వినియోగదారుల ఇళ్లలో లీకేజీ, రోడ్లపై సీవరేజ్ ఓవర్ ఫ్లో సమస్యలు గుర్తించినట్లు తెలిపారు. రోజూ వచ్చే ఫిర్యాదుల్లో 60 శాతం ఇవే రావడంతో వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.
News January 3, 2025
HYD: జనవరి 8న విద్యుత్ BC ఉద్యోగుల మహాసభ
TG విద్యుత్ సంస్థల్లో BC ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి జాతీయ BC సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జనవరి 8న మ.2 గంటలకు HYD ఎర్రమంజిల్‌లో మహాసభ జరగనుంది. రాజ్యసభ MP R.కృష్ణయ్య అధ్యక్షతన జరిగే ఈసభలో BC ఉద్యోగుల పదోన్నతులు, రిజర్వేషన్లు, పాత పెన్షన్ విధానం, అర్హతల ఆధారంగా ఆర్టిజన్‌లకు పదోన్నతులు వంటి ప్రధాన డిమాండ్లపై తీర్మానాలు జరుగుతాయి. ముఖ్యఅతిథులుగా ఈటల రాజేందర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.