News April 9, 2026

HYD: DANGER.. ఈ బాటిల్స్‌లో వాటర్..!

image

HYDలో నాసిరకం, కల్తీ ఘటనలు కలకలం రేపుతున్నాయి. వేసవిలో బయట ఎక్స్‌పైర్డ్, నాసిరకం వాటర్ బాటిల్‌ కొని తాగితే ప్రమాదం కొని తెచ్చుకున్నట్లేనని వైద్యులు హెచ్చరించారు. బాటిల్‌పై ట్రయాంగిల్‌లో 1 ఉంటే అది సింగిల్ యూజ్. రెండోసారి వాడితే క్యాన్సర్ కారకాలు విడుదలవుతాయి. 3, 6, 7 ఉంటే నాసిరకం ప్లాస్టిక్. 2, 4, 5 ఉంటే 6నెలల వరకు వాడొచ్చు. రంగు మారితే పడేయాలి. స్టీల్, కాపర్ బాటిల్ క్యారీ చేయడం బెటర్.
#SHAREIT

Similar News

News April 9, 2026

ఖైరతాబాద్: సమతా కిచెన్ ప్రారంభించిన మంత్రి

image

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా హైదరాబాద్ కలెక్టరేట్‌లో సమతా కిచెన్ ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై రిబ్బన్ కట్ చేశారు. అనంతరం దివ్యాంగులకు బ్యాటరీ వీల్ చైర్లు, ట్రాన్స్ జెండర్లకు ERS చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, HYD కలెక్టర్ దాసరి హరిచందన, పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు.

News April 9, 2026

జగిత్యాల: తహశీల్దార్ల డిప్యూటేషన్ ఉత్తర్వులు

image

జగిత్యాల జిల్లాలో పరిపాలనా అవసరాల దృష్ట్యా తహశీల్దార్లను డిప్యూటేషన్‌పై బదిలీ చేస్తూ కలెక్టర్ సత్యప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. డి.నరేష్‌ను కొడిమ్యాల్ తహశీల్దార్‌గా, ఎం.కిరణ్ కుమార్‌ను మల్యాల ఇన్‌ఛార్జ్ తహశీల్దార్‌గా నియమించారు. మల్యాల తహశీల్దార్ కె.వసంతను జగిత్యాల ఆర్డీవో కార్యాలయంలో, డీఏఓగా నియమించారు. సంబంధిత అధికారులు తక్షణమే బాధ్యతలు స్వీకరించాలని సూచించారు.

News April 9, 2026

నల్గొండ: ఫీల్డ్ అసిస్టెంట్ల కొరత.. ఉపాధి పనులకు ఆటంకం

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫీల్డ్ అసిస్టెంట్ల కొరతతో ఉపాధి హామీ పనులకు ఆటంకం కలుగుతోంది. 1,751 పంచాయతీలకు గాను కేవలం 1,202 మంది మాత్రమే విధుల్లో ఉండటంతో సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో పర్యవేక్షణ కరవైంది. దీనివల్ల వేతనాల చెల్లింపులో జాప్యం జరుగుతోందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే ఖాళీలను భర్తీ చేసి పనులు సజావుగా సాగేలా చూడాలని వారు డిమాండ్ చేస్తున్నారు.