News January 10, 2026

HYD: DANGER.. చిన్నపిల్లలకు ఈ సిరప్‌ వాడొద్దు

image

చిన్నపిల్లలకు ఇచ్చే ‘అల్మాంట్‌-కిడ్‌’ సిరప్‌ విషయంలో రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) కీలక హెచ్చరిక జారీ చేసింది. బిహార్‌కు చెందిన ట్రైడస్ రెమెడీస్ ఉత్పత్తి చేసిన ఈ మందులో (బ్యాచ్: AL-24002) ప్రాణాంతకమైన ‘ఇథిలీన్ గ్లైకాల్’ రసాయనం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజల వద్ద ఈ బ్యాచ్ సిరప్ ఉంటే వెంటనే 1800-599-6969 నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. దీన్ని తక్షణమే వాడకం నిలిపివేయాలన్నారు.

Similar News

News February 1, 2026

బడ్జెట్: HYD అభివృద్ధికి కొత్త ఊపిరి

image

నేడు పార్లమెంట్‌లో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ HYD అభివృద్ధికి కొత్త ఊపిరి పోసింది. ‘అర్బన్ ఛాలెంజ్ ఫండ్’ కింద ప్రకటించిన రూ.1 లక్ష కోట్ల గ్రాంట్‌లో HYD మెట్రో ఫేజ్-2 (Phase IIA & IIB) విస్తరణకు కేంద్రం పచ్చజెండా ఊపింది. RRR దక్షిణ భాగానికి లైన్ క్లియర్ చేయడంతో పాటు, రూ.40వేల కోట్లు సెమీకండక్టర్ మిషన్ 2.0లో నగరానికి పెద్దపీట వేశారు. ‘బయోఫార్మా శక్తి’ కింద రూ.10వేల కోట్లు కేటాయించారు.

News February 1, 2026

HYD: నగరవాసుల ‘చూపంతా ఆ మంత్రిపైనే’

image

2026 BUDGETపై HYD గంపెడాశలు పెట్టుకుంది. ప్రభుత్వం ఇప్పటికే రూ.44000CR అంచనాతో మెట్రో రైల్ ఫేజ్ 2 ప్రతిపాదనను కేంద్రం ముందుంచింది. అలాగే RRR దక్షిణ భాగానికి జాతీయ హోదా, రూ.34,367CR నిధుల కోసం చూస్తోంది. నిన్నే GHMC నగరాభివృద్ధికి రూ.11,460CR భారీ బడ్జెట్‌ను ఆమోదించింది. మూసీ పునరుజ్జీవం, ఎయిర్పోర్టులు , సెమీకండక్టర్ మిషన్‌లో భాగస్వామ్యంపై కేంద్రం ఎలాంటి ప్రకటన చేస్తుందోనని నగరం ఆసక్తిగా చూస్తోంది.

News February 1, 2026

సిట్ విచారణకు KCR.. సిటీలో BRS ప్లాన్ ఇదే?

image

నేడు KCR సిట్ విచారణ నేపథ్యంలో నగరంలో BRS నేతలు భారీ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎర్రవెల్లిలోని ఫాంహౌస్‌లో ఉన్న KCR ఉదయం 11 గంటలకు నందినగర్‌లోని నివాసానికి రానున్నారు. అయితే, KCR మీద కక్ష పూరితంగా ప్రభుత్వం విచారణకు పిలుస్తోందని BRS నేతలు ఇప్పటికే ఖండించారు. అన్ని ఏరియాల్లో నిరసన తెలపాలని మరోవైపు KTR పిలుపునిచ్చారు. సిటీలో BRS నేతలు బల ప్రదర్శన చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.