News December 4, 2025

HYD: DEC 16న అథ్లెటిక్స్ MEET

image

డిసెంబర్ 16న సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో సబ్ జూనియర్, యూత్ అథ్లెటిక్స్ మీట్ 2025 జరగనుంది. ఉ. 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ పోటీల్లో 4- 20 ఏళ్లలోపు బాలలు, బాలికలు పాల్గొనవచ్చు. స్ప్రింట్, రన్నింగ్, లాంగ్ జంప్ ఉంటాయి. ఆసక్తి గలవారు https://forms.gle/ouD9qXh9QTyAY7R47 రిజిస్టర్ చేసుకోవాలని. మిగతా వివరాలకు 99630 48320, 99590 91114‌లలో సంప్రదించండి.

Similar News

News December 4, 2025

పుతిన్ పర్యటన.. ఫొటోలు పంచుకున్న ప్రధాని

image

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఢిల్లీ చేరుకున్న విషయం తెలిసిందే. స్వయంగా ప్రధాని మోదీ ఆయనకు స్వాగతం పలికారు. ఒకే కారులో ఇద్దరూ ప్రధాని నివాసానికి చేరుకున్నారు. దీనికి సంబంధించి PM మోదీ కొన్ని ఫొటోలు షేర్ చేశారు. ‘నా ఫ్రెండ్ అధ్యక్షుడు పుతిన్‌ను స్వాగతించినందుకు సంతోషిస్తున్నాను. రేపు మా మధ్య జరగబోయే సమావేశాల కోసం ఎదురుచూస్తున్నాను. భారత్-రష్యా స్నేహం మన ప్రజలకు ఎంతో మేలు చేసింది’ అని ట్వీట్ చేశారు.

News December 4, 2025

6న విశాఖ రానున్న గవర్నర్ అబ్దుల్ నజీర్

image

ఈ నెల 6,7వ తేదీలలో గవర్నర్ అబ్దుల్ నజీర్ విశాఖ రానున్నారు. ఆరోజున ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకొని అక్కడ నుండి నోవాటెల్ కు చేరుకుంటారు. మధ్యామ్నం 12.45 గంటలకు మధురవాడలోని ACA-VDCA క్రికెట్ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ వీక్షిస్తారు. రాత్రి 10గంటలకు స్టేడియం నుంచి నోవాటెల్ హోటల్‌కు చేరుకుని రాత్రి బస చేస్తారు. 7వ తేదీ మధ్యాహ్నం 1.45కు ఎయిర్ పోర్ట్‌కు చేరుకుని విజయవాడ తిరిగి వెళ్తారు

News December 4, 2025

పుతిన్ పర్యటన ప్రతి అడుగులో ‘FSO’ నిఘా

image

అత్యంత పటిష్ఠ భద్రత మధ్య రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటన సాగుతోంది. విదేశీ ప్రముఖుల భద్రతను ఆతిథ్య దేశాలే సహజంగా పర్యవేక్షిస్తుంటాయి. పుతిన్ పర్యటనను మాత్రం రష్యాలోని రహస్య సంస్థ ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీసెస్ చూస్తుంది. ఆయన ఉండే భవనం, తీసుకొనే ఆహారం సహా ప్రతి అడుగులో పలు జాగ్రత్తలు తీసుకుంటారని మాజీ బాడీగార్డు ఒకరు తెలిపారు. పుతిన్ తినే ఫుడ్‌ను ఫస్ట్ ఓ బాడీగార్డ్ టేస్ట్ చేస్తారని చెప్పారు.