News September 9, 2024
HYD: DSC ఫైనల్ కీలో తప్పులు.. అధికారులను కలిసిన అభ్యర్థులు
DSC అభ్యర్థులు ఈరోజు HYDలో ఉన్న పాఠశాల విద్యా కార్యాలయంలోని విద్యాశాఖ అధికారులకు కలిశారు. ఇటీవల విడుదల చేసిన DSCఫైనల్ కీలో కొన్ని తప్పులు ఉన్నాయని, పాఠ్య పుస్తకాల ప్రకారం సమాధానాలు ఇవ్వకుండా కొన్ని సమాధానాలు మార్పు చేశారని అభ్యర్థులు వాపోయారు. ఎలాగైనా తమకు న్యాయం చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. అభ్యర్థులు ఇచ్చిన ఆధారాలను మరోసారి రివ్యూ కమిటీకి సెండ్ చేస్తామని అదికారులు తెలిపారని వారు అన్నారు.
Similar News
News October 10, 2024
HYD: బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన RTC ఎండీ
తెలంగాణ ఆడపడుచులకి ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ ఉత్సవాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉందని గుర్తు చేశారు. తెలంగాణ ఆడవపడుచులు బతుకమ్మను రంగు పూలతో అలంకరించి పూజలు చేయడం ఆనందం కలిగిస్తుందన్నారు. తెలంగాణ బతుకమ్మ ఉత్సవాలకు ప్రత్యేక గుర్తింపు ఉందని కీర్తించారు.
News October 10, 2024
HYD: హైడ్రా పవర్స్.. పూర్తి వివరాలు!
ప్రభుత్వం జులై 17న హైడ్రా ఏర్పాటు చేస్తూ GO 59 జారీ చేసింది. గ్రేటర్‌తో పాటు 8 మున్సిపల్ కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలు, 38 పంచాయతీలు, 61 పారిశ్రామికవాడలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ను హైడ్రాకు అప్పగించింది. GHMC, స్థానిక సంస్థల పరిధి పార్కులు, లే అవుట్లు, ఖాళీ స్థలాలు, పరిశ్రమల శాఖ స్థలాలు, జలవనరుల స్థలాలు పరిరక్షించడమే దీని బాధ్యత. తాజాగా 51 విలీన గ్రామాలు హైడ్రా పరిధిలోకి వచ్చాయి.
News October 10, 2024
HYD: మూసీలో తగ్గుతోన్న ఆక్సిజన్!
HYD మూసీ కాలుష్య కాసారంగా మారుతోంది. నీటిలో కరిగే ఆక్సిజన్ స్థాయి రోజురోజుకు తగ్గుతోంది. ఇదే సమయంలో రసాయనాల స్థాయి పెరుగుతుందని CPCB తెలిపింది. నీటిలో కరిగే ఆక్సిజన్(DO) CPCB ప్రకారం లీటర్ నీటిలో 6 మిల్లీ గ్రాములు ఉండాలి. కానీ, గండిపేట-6, బాపూఘాట్, ముసారాంబాగ్, నాగోల్, పీర్జాదిగూడ, ప్రతాపసింగారం, పిల్లాయిపల్లిలో 0.3 మాత్రమే ఉండటం ఆందోళనకరం. దీంతో మూసీలో జలచరాలు బతకడం కష్టమే.