News November 22, 2024
HYD: Earned Leaves ఇవ్వాలని డిమాండ్

పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు సంపాదిత సెలవులు మంజూరు చేయాలని TS UTF నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. జనగణనలో పాల్గొంటున్న ఉపాధ్యాయులకు రోజువారి లక్ష్యాలు కేటాయించి ఒత్తిడి తీసుకురావద్దని గురువారం కడ్తాల్ MEO సత్యనారాయణను వినతి పత్రంలో కోరారు. TS UTF నాయకులు గోపాల్ నాయక్, జంగయ్య, శంకర్, మల్లయ్య, విజయ్ కుమార్, నరసింహమూర్తి పాల్గొన్నారు. ఎర్న్డ్ లీవ్స్ డిమాండ్‌పై మీ కామెంట్?
Similar News
News December 21, 2025
HYD: రేపు నాట్కో పరిశ్రమలో ‘మాక్ ఎక్సర్‌సైజ్’

ప్రకృతి విపత్తులు, అగ్ని ప్రమాదాల వేళ అనుసరించాల్సిన రక్షణ చర్యలపై అవగాహన కల్పించేందుకు ఈనెల 22న మేకగూడలోని నాట్కో పరిశ్రమ ఆవరణలో ‘మాక్ ఎక్సర్‌సైజ్’ నిర్వహించనున్నట్లు కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ప్రమాద సమయాల్లో ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు ముందస్తు సన్నద్ధత అవసరమని, అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలనే అంశంపై సిబ్బందికి, అధికారులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తామని వెల్లడించారు.
News December 21, 2025
చలి గుప్పెట్లో ఉమ్మడి రంగారెడ్డి.. 5.1 డిగ్రీల ఉష్ణోగ్రత

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. శనివారం మొయినాబాద్ మండలం రెడ్డిపల్లిలో అత్యల్పంగా 5.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటలో 5.8, మౌలాలిలో 7.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో వీస్తున్న చల్లని గాలులకు ప్రజలు గజగజ వణుకుతున్నారు. చలి తీవ్రత దృష్ట్యా వృద్ధులు, చిన్నారులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
News December 20, 2025
22వ తేదీ నుంచి యథావిధిగా ప్రజావాణి: నారాయణ రెడ్డి

కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజావాణి’ కార్యక్రమం ఈనెల 22 నుంచి యథావిధిగా ప్రారంభం కానుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ఉదయం 10 గంటల నుంచి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రజలు తమ ఫిర్యాదులు, వినతులతో హాజరు కావచ్చని కలెక్టర్ సూచించారు.


