News November 22, 2024
HYD: Earned Leaves ఇవ్వాలని డిమాండ్
పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు సంపాదిత సెలవులు మంజూరు చేయాలని TS UTF నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. జనగణనలో పాల్గొంటున్న ఉపాధ్యాయులకు రోజువారి లక్ష్యాలు కేటాయించి ఒత్తిడి తీసుకురావద్దని గురువారం కడ్తాల్ MEO సత్యనారాయణను వినతి పత్రంలో కోరారు. TS UTF నాయకులు గోపాల్ నాయక్, జంగయ్య, శంకర్, మల్లయ్య, విజయ్ కుమార్, నరసింహమూర్తి పాల్గొన్నారు. ఎర్న్డ్ లీవ్స్ డిమాండ్‌పై మీ కామెంట్?
Similar News
News November 21, 2024
హైదరాబాద్ వస్తున్న MLC కారుకు ప్రమాదం
MLC నవీన్ కుమార్ రెడ్డి కారుకు షాద్‌నగర్‌లో ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలు.. బెంగళూరు హైవే మీదుగా హైదరాబాద్ వైపు వెళుతున్న కాన్వాయ్‌కు షాద్‌నగర్ మిలీనియం టౌన్షిప్ సమీపంలో స్కూటీ అడ్డు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మోటరిస్ట్‌కు గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని తన వాహనంలో MLC నవీన్ ఆస్పత్రికి తరలించారు. ఆయన సురక్షితంగా బయటపడ్డట్లు తెలుస్తోంది.
News November 21, 2024
HYD: కానిస్టేబుళ్లలో వారే TOP..!
రాష్ట్ర వ్యాప్తంగా నేడు 8,047 మంది సివిల్, AR, CPL, IT, PTO విభాగాల కానిస్టేబుల్ అభ్యర్థులు పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొంటున్నారు. ఇంటర్ అర్హతతో పొందే కానిస్టేబుల్ ఉద్యోగంలో 5,470 మంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారే ఉన్నారు. మరోవైపు 1361 మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ సైతం పూర్తి చేశారు. 1755 మంది టెక్నికల్ విద్యను అభ్యసించారు. HYD అంబర్ పేట్ PTC లోనూ పలువురికి ట్రైనింగ్ అందించారు.
News November 21, 2024
HYD: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
బిల్డింగ్‌పై నుంచి దూకి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. HYD మైండ్ స్పేస్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా నవీన్ రెడ్డి (24) పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం 13వ అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.