News September 2, 2025
HYD: Ed.CET సెకండ్ ఫేజ్ నేటితో లాస్ట్

Ed.CET 2025 సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ నేటితో ముగుస్తుందని ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియలో పాల్గొనని వారికి, వెబ్ ఆప్షన్ ఛాన్స్ ఉండదని తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యార్థులందరూ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లో పాల్గొనాలని సూచించారు.
Similar News
News September 2, 2025
అవినీతి సొమ్ము పంచుకోవడంలో విభేదాలు: రాంచందర్ రావు

TG: ‘కాళేశ్వరం’లో అవినీతి జరిగిందని కవిత వ్యాఖ్యలతో స్పష్టమైందని బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు అన్నారు. అవినీతి సొమ్ము పంపకాల్లో తేడాల వల్లే కుటుంబంలో విభేదాలు వచ్చాయని ఆరోపించారు. కాళేశ్వరం అవినీతిని డైవర్షన్ చేసేందుకు కవితను సస్పెండ్ చేశారని ఎంపీ డీకే అరుణ అన్నారు. కల్వకుంట్ల కుటుంబంలో అధికారంకోసం పంచాయితీ జరుగుతోందన్నారు. BRS, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు.
News September 2, 2025
అలంపూర్ ఆలయాలతో వైఎస్సార్‌కు అనుబంధం

మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డికి అలంపూర్ ఆలయాలతో మంచి అనుబంధం ఉందని స్థానికులు గుర్తు చేసుకున్నారు. 2008లో జరిగిన తుంగభద్ర పుష్కరాల సందర్భంగా అలంపూర్‌కు వచ్చిన వైఎస్సార్, జోగులాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన చూపించిన భక్తి, ఈ ప్రాంతంపై ఉన్న అభిమానం ఆయన అభిమానుల గుండెల్లో నిలిచిపోయాయి.
News September 2, 2025
గజ్వేల్ బస్తీ దవాఖానను సందర్శించిన కలెక్టర్

గజ్వేల్ కోట మైసమ్మ దేవాలయం దగ్గర ఉన్న బస్తీ దవాఖానకు కలెక్టర్ కె.హైమావతి ఆకస్మికంగా సందర్శించారు. రోగులకు అందే వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అటెండెన్స్ రిజిస్టర్ వెరిఫై చేశారు. సీజనల్ వ్యాధుల గురించి ఎంతమంది రోగులు వస్తున్నారు, డెగ్యూ పరీక్షలు చేస్తున్నారా..? అని మెడికల్ ఆఫీసర్‌ను అడిగారు. జ్వరం తగ్గని ప్రతి ఒక్కరికి పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు.