News May 4, 2024
HYD: FAKE వాటర్ బాటిల్స్ సీజ్..!

HYD నాంపల్లిలోని బిలాల్ ఐస్ క్రీమ్ సెంటర్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల బృందం తనిఖీలు చేపట్టింది. తనిఖీల్లో ఫేక్ వాటర్ బాటిల్స్ అమ్ముతున్నట్లుగా గుర్తించి సీజ్ చేశారు. అంతేకాక ఎలాంటి లైసెన్స్ లేకుండా క్రయ విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తించిన అధికారులు, నోటీసు జారీ చేసినట్లుగా పేర్కొన్నారు. లైసెన్స్ లేకుండా విక్రయాలు చేపడితే చట్టపరంగా శిక్ష తప్పదన్నారు.
Similar News
News November 21, 2025
Skill Trainingలో సిటీ పోలీస్ బాస్

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆకస్మికంగా పేట్ల బురుజు, చేలపురా సిటీసీ శిక్షణా కేంద్రాలను సందర్శించారు. హోంగార్డు నుంచి ఎస్సై స్థాయి వరకు 350 మంది సిబ్బంది తీసుకుంటున్న శిక్షణను పరిశీలించారు. “ఒక గొప్ప మార్పునకు ఇదే శ్రీకారం” నైపుణ్యాభివృద్ధి శిక్షణ గురించి తెలుసుకున్నారు. ట్రైనింగ్ విధానంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రక్షిత కృష్ణమూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
News November 21, 2025
IPSల బదిలీ.. సిటీకి కొత్త బాస్‌లు

రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. CID డీఐజీగా పరిమళ నూతన్, మహేశ్వరం DCPగా నారాయణరెడ్డి, నార్కోటిక్ SPగా పద్మజా, మల్కాజిగిరి DCPగా శ్రీధర్, సౌత్ జోన్ DCPగా కిరణ్ ఖారే, టాస్క్‌ఫోర్స్ DCPగా వైభవ్ గైక్వాడ్, ఎస్ఎంఐటీ డీసీపీగా రూపేశ్, గవర్నర్ ఏడీసీగా పి.సుభాష్, టీజీ ట్రాన్స్‌కో ఎస్పీగా శ్రీనివాస్, రాచకొండ క్రైమ్స్ డీసీపీగా గుణశేఖర్‌ను నియమిస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి.
News November 21, 2025
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సీఐడీ విచారణకు నిధి అగర్వాల్

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సీఐడీ విచారణ వేగవంతం చేసింది. మ.3గం.కు హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి సీఐడీ కార్యాలయానికి హాజరవుతున్నారు. ప్రమోషన్లకు సంబంధించిన వివరాలపై అధికారులు కీలకంగా ప్రశ్నించనున్నట్లు సమాచారం. ప్రమోషన్లు చేసిన తర్వాత ఎంత పారితోష్కం తీసుకున్నారన్న అంశాలపై సీఐడీ విచారణ జరుపుతోంది.


