News November 20, 2024
HYD: FAKE మెడిసిన్ అమ్మితే కాల్ చేయండి!
HYD నగరంలో ఇటీవల డ్రగ్స్ కంట్రోల్ అధికారులు మెడికల్ దుకాణాలపై తనిఖీలను ముమ్మరం చేశారు. నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే, చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. HYD, RR, MDCL, VKB జిల్లాలో ఎక్కడైనా ఫేక్ మెడిసిన్ కానీ, MRP ధరకు మించి అమ్ముతున్నట్లు తెలిస్తే వెంటనే తమకు 18005996969కు ఫిర్యాదు చేయాలని అధికారులు కోరారు. ఉ.10:30 నుంచి సా.5 వరకు అందుబాటులో ఉంటుందన్నారు.
Similar News
News November 20, 2024
HYD: ఇల్లు కట్టుకునే వారికి GOOD NEWS
గ్రేటర్ HYDలో ఇల్లు కట్టుకునే వారికి జలమండలి శుభవార్త తెలిపింది. బిల్డింగ్ పర్మిషన్ కోసం కావాల్సిన వాటర్ ఫీజిబిలిటీ పత్రాన్ని ఇకనుంచి డైరెక్ట్‌గా ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయం నుంచి జారీ చేయనున్నట్లు పేర్కొంది. గతంలో స్థానిక CGM కార్యాలయాలలో జారీ చేసేవారు. కానీ వివిధ కారణాలతో తీవ్ర జాప్యం జరిగేది. దీంతో బిల్డింగ్ నిర్మాణానికి ఆలస్యం అయ్యేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని MD అశోక్ రెడ్డి తెలిపారు.
News November 20, 2024
HYD: తగ్గిన ఫిర్యాదులు.. లెక్కలు ఇవే..!
గ్రేటర్ HYDలో డివిజన్లలో సెప్టెంబర్‌లో వినియోగదారుల ఇంటి వద్ద చోకేజీ సమస్యలు 12,105 జలమండలి దృష్టికి వచ్చాయి. అదే అక్టోబర్‌లో 9,697 నమోదై, గత నెలతో పోలిస్తే 2,408 ఫిర్యాదులు తగ్గాయి. అంటే 20% ఫిర్యాదులు తగ్గాయి. సీవరేజ్ ఓవర్ ఫ్లో సమస్యలు సెప్టెంబర్‌లో 30,105 నమోదు కాగా, అక్టోబర్‌లో 23,293 నమోదై. గత నెలతో పోలిస్తే 6,812 ఫిర్యాదులు తగ్గాయి. అంటే 23% ఫిర్యాదులు తగ్గినట్లు రిపోర్ట్ వెల్లడించింది.
News November 20, 2024
HYD: కమ్యూనిటీ హాళ్లలోనే అనేక స్కూళ్లు..!
HYD జిల్లా పరిధిలో అనేక ప్రాంతాల్లో కమ్యూనిటీ హాళ్లలోనే పాఠశాలలు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 691 పాఠశాలలు ఉండగా 68 పాఠశాలలు కమ్యూనిటీ హాళ్లలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. పలుచోట్ల ఒక గది పాఠశాలలు సైతం ఉండడం గమనార్హం. HYD నగర పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టి, వసతులు మెరుగుపరచాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.