News February 25, 2026
HYD: FSL హాల్ టికెట్లపై కీలక అప్డేట్.. రేపట్నుంచే

TG ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ(FSL) రాత పరీక్షల హాల్ టికెట్లకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. రేపు ఉదయం 8 గంటల నుంచి వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని TSLPRB ఛైర్మన్ VV శ్రీనివాసరావు తెలిపారు. మార్చి 5, 6, 7 తేదీల్లో మేడ్చల్ పీటీసీలో ఈ పరీక్షలు జరగనున్నాయన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్‌పై ఫొటో తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలన్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేశారు.
Similar News
News April 16, 2026
ప.గో: ఏఆర్‌టీ కేంద్రాల్లో సిబ్బంది చేతివాటం

ఉమ్మడి ప.గో జిల్లాలోని ఏఆర్‌టీ కేంద్రాల్లో హెచ్‌ఐవీ బాధితులకు ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లా వ్యాప్తంగా సుమారు 20 వేల మంది ప్రతి నెలా ఇక్కడ మందులు, కౌన్సెలింగ్ పొందుతున్నారు. అయితే, కొందరు సిబ్బంది వీరి నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అడిగినవి ఇవ్వకపోతే మందులు వెంటనే ఇవ్వకుండా వేధిస్తున్నారని వాపోతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
News April 16, 2026
అమరావతి ఓఆర్ఆర్ పనులకు లైన్ క్లియర్!

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని ఆపేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. కృష్ణా జిల్లా రైతు వేసిన పిల్ వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని సీజే ధర్మాసనం ఆక్షేపించింది. ప్రాజెక్టు అలైన్‌మెంట్‌ను ఓ వ్యక్తి ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించింది. అభివృద్ధి పనుల్లో జోక్యం చేసుకోబోమని కోర్టు స్పష్టం చేసింది. పనులు కొనసాగించేందుకు NHAIకి అనుమతినిస్తూ, తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.
News April 16, 2026
గద్వాల్ జిల్లాలో తగ్గేదేలే అంటున్న ఎండలు

గద్వాల్ జిల్లాలో ఎండలు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తెలంగాణ వెదర్‌మ్యాన్ రిపోర్ట్ ప్రకారం.. గద్వాల్ జిల్లాలో గురువారం గరిష్ఠ ఉష్ణోగ్రత 43.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపిస్తుండటంతో జనం రోడ్లపైకి రావడానికి భయపడుతున్నారు. మండుతున్న ఎండల నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, తగినంత నీరు, పానీయాలు తీసుకోవాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు.


