News August 21, 2025

HYD: GATE కోచింగ్‌కు విద్యార్థుల క్యూ

image

M.Tech, PhD ప్రవేశాల కోసం నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(GATE) పరీక్ష నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో విద్యార్థులు ప్రిపరేషన్‌పై ఫోకస్ పెట్టారు. అమీర్‌పేట, KPHB, దిల్‌సుఖ్‌నగర్, అబిడ్స్ ప్రాంతాల్లో కోచింగ్ సెంటర్లకు క్యూ కడుతున్నారు. 2026 ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీల్లో ఎంట్రెన్స్ ఎగ్జామ్ జరగనుంది.

Similar News

News April 5, 2026

KMR: జిల్లాలో చికెన్, మటన్ ధరలు

image

కామారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం చికెన్, మటన్ ధరల వివరాలు ఇలా ఉన్నాయి. కిలో చికెన్ స్కిన్ లెస్ రూ.280-రూ.290 విక్రయిస్తుండగా లైవ్ కోడి రూ.190 చొప్పున విక్రయిస్తున్నారు. అలాగే మటన్ ధర కిలో రూ.800 చొప్పున విక్రయిస్తున్నారు. చికెన్ ధరలు గత వారంతో పోలిస్తే కాస్త తగ్గుముఖం పట్టాయి. మటన్ ధరలో ఎలాంటి మార్పు లేదు.

News April 5, 2026

IPL: ఇప్పటి వరకు వీళ్లే టాప్!

image

IPL-19లో ఇప్పటి వరకు 9మ్యాచులు జరగ్గా పలువురు యంగ్ క్రికెటర్లు సత్తా చాటారు. DC ప్లేయర్ సమీర్ రిజ్వీ ఆడిన 2 మ్యాచుల్లోనూ హాఫ్ సెంచరీలతో 160పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత లిస్టులో రోహిత్(113), కూపర్(108), రఘువంశీ(103) ఉన్నారు. ఇక రవి బిష్ణోయ్(RR) 5 వికెట్లతో పర్పుల్ క్యాప్‌ దక్కించుకున్నారు. వైశాఖ్ విజయ్ కుమార్ సైతం 5 వికెట్లు పడగొట్టినా ఎకానమీ పరంగా 2వ స్థానంలో ఉన్నారు.

News April 5, 2026

ఖమ్మం జడ్పీకి 62 ఏళ్లు.. అభివృద్ధి సేవల్లో మైలురాయి

image

ఖమ్మం జిల్లా పరిషత్‌కు 62 ఏళ్లు పూర్తయ్యాయి. 1964 ఏప్రిల్ 6న కామరాజ్ నాడార్ చేతుల మీదుగా ఈ ZP భవనం ప్రారంభమైంది. 1959లో జరిగిన తొలి ఎన్నికల్లో జలగం వెంగళరావు మొదటి ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి జిల్లా అభివృద్ధిలో జడ్పీ కీలక పాత్ర పోషిస్తూ పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తోంది. ఇప్పటివరకు 12 మంది ఛైర్మన్లు, 49 మంది సీఈవోలు సేవలందించారు. 2014 తొలిసారిగా ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది.