News November 2, 2024
HYD: GET READY.. 21 వేల మందితో సర్వే!
గ్రేటర్ HYDలో సకుటుంబ సర్వేకు సర్వం సిద్ధమైంది. ఈ సర్వేలో గ్రేటర్ వ్యాప్తంగా 21 వేల ఎన్యుమరేటర్లు, రిసోర్స్ పర్సన్లు, సూపర్‌వైజర్లు పాల్గొంటారని మున్సిపల్ & అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ తెలిపారు. హైదరాబాద్ బంజారాహిల్స్ గౌరీ శంకర్ కమ్యూనిటీ హాల్లో జరిగిన ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఆయన పాల్గొన్నారు.ఈ నెల 6 నుంచి సర్వే ప్రారంభం కానుండగా.. 100 శాతం ఖచ్చితత్వంతో నిర్వహించాలని ఆదేశించారు.
Similar News
News December 5, 2024
HYD: రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం ఏర్పాటు: మంత్రి
HYD రవీంద్ర భారతి కళాభవన్‌లో సీల్ వేల్ కార్పొరేషన్ ఆదర్శ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘంటసాల జీవన సాఫల్య పురస్కారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. రవీంద్రభారతి కళాభవన్‌లో గాన గంధర్వడు ఎస్పీ బాలు విగ్రహాన్ని త్వరలో ఏర్పాటు చేస్తామని, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోని కవులు, కళాకారులు, సాహితీవేత్తలతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.
News December 5, 2024
HYD: పాన్ కార్డు కరెక్షన్స్.. ఇది మీ కోసమే!
HYD అమీర్‌పేట స్వర్ణ భారతి కాంప్లెక్స్ భవనంలో CSC హెడ్ ఆఫీసులో పాన్ కార్డు, పాస్ పోర్టు సర్వీసులు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పాన్ కార్డులో పేరు, DOB మార్పులు చేర్పులు కూడా చేస్తామన్నారు. మిగతా సర్వీసులు సైతం అందుబాటులో ఉన్నాయని, అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.SHARE IT
News December 5, 2024
షాకింగ్: సికింద్రాబాద్‌లో మొండెంలేని శిశువు తల
సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో కళ్లు చెమర్చే సంఘటన వెలుగుచూసింది. జనరల్‌బజార్‌లోని బంగారం దుకాణాల కాంప్లెక్స్ వద్ద మొండెంలేని పసికందు తల లభ్యమైంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కేసు నమోదు చేసిన మహంకాళి పోలీసులు CC కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.