News August 1, 2024
HYD: GHMCలో విలీనం కానున్న మున్సిపాలిటీలు!

HYD శివారు ప్రాంతాలు GHMCలో విలీనం కానున్నాయి. రంగారెడ్డి పెద్దఅంబర్‌పేట్, IBP, జల్పల్లి, శంషాబాద్, తుర్కయాంజాల, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, తుక్కుగూడ ఈ జాబితాలో ఉన్నాయి. అలాగే మేడ్చల్ మల్కాజిగిరిలోని దమ్మాయిగూడ, నాగారం, ఘట్కేసర్, గుండ్ల పోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, దుండిగల్ పోచారం.. సంగారెడ్డిలోని బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్ ఉన్నాయి. డ్రాఫ్ట్ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందాల్సి ఉంది.
Similar News
News January 11, 2026
HYD: చైనా మాంజాతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చెయ్యి కట్!

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చైనా మాంజా తగిలి సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి తీవ్ర గాయాలయ్యాయి. గచ్చిబౌలి నుంచి హఫీజ్‌పేట్ వైపు బైక్‌పై చైతన్య (27) వెళ్తున్నాడు. బొటానికల్ గార్డెన్ ఫ్లైఓవర్ పైకి రాగానే చైతన్య చేయికి గాలి పటం మాంజా తగిలింది. దీంతో మాంజా చెయ్యికి చుట్టుకోవడంతో చైతన్య చెయ్యి తెగింది. తీవ్ర గాయాలు అయిన చైతన్యను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
News January 11, 2026
HYD: కార్పొరేషన్ కోసం లష్కర్‌లో లడాయి

GHMCని 3గా విభజించనున్న నేపథ్యంలో సికింద్రాబాద్ లేదా లష్కర్ పేరిట కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ బలపడుతోంది. 220 ఏళ్ల చరిత్ర కలిగిన సికింద్రాబాద్‌ను విస్మరించడం తగదని స్థానికులు, BRS నేతలు మండిపడుతున్నారు. HYD- సికింద్రాబాద్ జంట నగరాలుగా పేరొందగా, సికింద్రాబాద్ పేరు లేకుండా పునర్వ్యవస్థీకరణ సరికాదంటున్నారు. సర్కార్ దిగొచ్చి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొనేలా ఉద్యమం ఉద్ధృతం అయింది.
News January 11, 2026
HYD: ఆ నలుగురు లేకపోయినా!

ఎవరైనా కన్నుమూస్తే పాడె కట్టి నలుగురు మోసే అంతిమయాత్ర మన సంప్రదాయం. అయితే కాలానికి తగ్గట్టు ఆ విధానానికి ముగింపు పడుతోంది. పాడె మోయడానికి బదులుగా ‘పరమపద వాహనాలు’ అందుబాటులోకి వచ్చాయి. మృతదేహాన్ని సురక్షితంగా తరలించడమే కాకుండా, కుటుంబ సభ్యులు కూర్చునే సౌకర్యం కల్పించారు. శ్మశానం వరకూ గౌరవంగా అంతిమయాత్ర నిర్వహించేలా ఈ వాహనాలు మార్గం చూపుతున్నాయి. ఆ నలుగురు లేనివారికి.. ఆఖరి మజిలీ సగౌరవంగా సాగుతోంది.


