News December 11, 2024

HYD: GHMC ఎన్నికలు.. భారీ ప్లాన్

image

GHMC ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నా నేతలు ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమదే మేయర్ పీఠం అని ఇటీవల బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. HYDలోని డివిజన్లలో భారీ ఎత్తున పాదయాత్రలు ఉంటాయని‌ ఓ మంత్రి పేర్కొన్నారు. BRS, MIM ఎన్నికలపై స్పందించకపోయిన నగరవాసులు తమవైపు ఉంటారన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, డివిజన్లు పెరిగే ఛాన్స్ ఉంది. పార్టీలు బలంగా ఉండడంతో చతుర్ముఖ పోరు తప్పేలా లేదు.

Similar News

News December 27, 2024

HYD: ‘ఈ ఫ్లై ఓవర్ ఓపెన్ చేయండి!’

image

ఆరాంఘర్ నుంచి నెహ్రూ జూ పార్క్ రూట్‌లో ఏకంగా 4.04 కిలో మీటర్ల పొడవైన ఫ్లై ఓవర్ నిర్మించారు. ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఇటీవల CM రేవంత్ రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. పూర్తి స్థాయిలో వాహనాలకు అనుమతి ఇవ్వనట్లు తెలుస్తోంది. రాజకీయ నాయకులు ఈ ఫ్లై ఓవర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని @serish ట్వీట్ చేశారు. అధికారికంగా ప్రారంభోత్సవం జరిగినా.. తుది మెరుగుల కారణంగా బారీకేడ్‌లు ఏర్పాటు చేసినట్లు సమాచారం.

News December 27, 2024

నాంపల్లి ఎగ్జిబిషన్ 2025 విశేషాలు

image

జనవరి 1 నుంచి అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (ఎగ్జిబిషన్‌) 46 రోజులపాటు మహానగర వాసులను అలరించనుంది. ఈ 84వ నుమాయిష్‌లో 2,200 స్టాల్స్‌ ఏర్పాటు కానున్నాయి. అంతేకాక పలు ప్రభుత్వ శాఖల స్టాళ్ల ఏర్పాటు చేస్తున్నారు. 160 సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా వేసి నాలుగు ప్రధాన గేట్ల వద్ద మెటల్‌ డిటెక‍్టర్లతో క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఎంట్రీ ఫీజ్ రూ.50 (గతేడాది రూ.40)గా నిర్ణయించారు.

News December 27, 2024

HYD: మలేషియాలో తెలుగు కోర్సులు: నిత్యానందరావు

image

నాంపల్లిలో మలేషియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో తెలుగు భాషలో డిప్లొమా కోర్సుల నిర్వహణకు ఒప్పందం కుదుర్చుకున్నామని పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వైస్ ఛైర్మన్ నిత్యానందరావు తెలిపారు. తెలుగు భాష ఉనికి పోతే తెలుగు జాతి ఆస్తిత్వం కోల్పోతుందన్నారు. ఇది మలేషియాలో స్థిరపడ్డ తెలుగు జాతికి ఎంతో ఉపయోగమన్నారు. మలేషియా తెలుగు సంఘం ప్రతినిధులు వెంకట ప్రతాప్, సత్తయ్య, సుధాకర్ పాల్గొన్నారు.