News December 11, 2024

HYD: GHMC ఎన్నికలు.. భారీ ప్లాన్!

image

GHMC ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నా నేతలు ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమదే మేయర్ పీఠం అని ఇటీవల బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. HYDలోని డివిజన్లలో భారీ ఎత్తున పాదయాత్రలు ఉంటాయని‌ ఓ మంత్రి పేర్కొన్నారు. BRS, MIM ఎన్నికలపై స్పందించకపోయిన నగరవాసులు తమవైపు ఉంటారన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, డివిజన్లు పెరిగే ఛాన్స్ ఉంది. పార్టీలు బలంగా ఉండడంతో చతుర్ముఖ పోరు తప్పేలా లేదు.

Similar News

News November 12, 2025

FLASH: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో డ్రగ్స్ పట్టివేత

image

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఈరోజు అధికారులు డ్రగ్స్ పట్టుకున్నారు. బ్యాంకాక్‌ నుంచి ఇండిగో విమానంలో వచ్చిన ప్రయాణికుడు సలీంను (DRI) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో అతడి బ్యాగులో 4.3 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, సలీంను అదుపులోకి తీసుకున్న అధికారులు, నిషేధిత వస్తువులను సీజ్ చేశారు.

News November 11, 2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: MLAలు, మాజీ MLAలపై కేసు నమోదు

image

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై హైదరాబాద్ సిటీ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. మధురానగర్ PSలో ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామచంద్రనాయక్, రాందాస్‌పై రెండు కేసులు ఫైల్ అయ్యాయి. బోరబండ PSలో మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, మెతుకు ఆనంద్‌పై ఓ కేసు నమోదైంది. కోడ్ ఉల్లంఘనపై కఠిన చర్యలు కొనసాగుతాయని, ప్రజాస్వామ్యంగా ఎన్నికలు సాగాలంటే ప్రతి ఒక్కరూ నియమాలను గౌరవించాలని సిటీ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

News November 11, 2025

ప్రజావాణికి 29 ఫిర్యాదులు: రంగారెడ్డి కలెక్టర్

image

రంగారెడ్డి జిల్లా ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు మరింత శ్రద్ధ కనబరచాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణికి 29 ఫిర్యాదులు అందాయన్నారు. అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.