News September 3, 2024
HYD: GHMC పరిధిలో నిత్యావసరాల పంపిణీ: సీఎం

జీహెచ్ఎంసీ పరిధిలో వరదలపై సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సచివాలయంలో సమీక్షించారు. ‘హైదరాబాద్‌లో ఎక్కడా చిన్న ఆవాంఛనీయ ఘటన జరగడానికి వీల్లేదు. విద్యుత్, ట్రాఫిక్, తాగునీరు, పారిశుద్ధ్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాలి. కూలీలు పనులు దొరక్క ఇంటి దగ్గరే ఉండిపోతారు. వారిని గుర్తించి బియ్యం, పప్పులు, నిత్యావసర సరకులు పంపిణీ చేయాలి’ అని సీఎం ఆదేశించారు.
Similar News
News November 11, 2025
HYD: ఓటు వేసి ఈ పని చేయండి

ఓటు వేయడం మన బాధ్యత.. మనం ఓటేస్తే ఇంకొకరు పోలింగ్ బూత్‌కు వెళతారు.. అందుకే మీరు ఓటు వేసిన తరువాత బయటకు వచ్చి ‘నేను ఓటు వేశా.. మరి మీరు..? అని క్యాప్షన్ పెట్టి మీ ఇన్‌స్టా, ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియాల్లో పోస్ట్ చేయండి. దానిని చూసిన మరికొందరికి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఓటేస్తారు. ఇలా అందరూ చేస్తే పోలింగ్ శాతం పెరుగుతుంది..మంచి నాయకుడు గెలుస్తారు.
News November 11, 2025
జూబ్లీహిల్స్ బై పోల్: ఇది ఐడీ కార్డు కాదు.. లైఫ్ కార్డు

మీరు కొత్త ఓటరా.. ఈ మధ్యనే ఓటరుగా నమోదయ్యారా..! గుర్తుంది కదా.. నేడే పోలింగ్ డేట్. ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ ప్రారంభమవుతుంది. ఓటరు కార్డు వచ్చింది కదా అని పర్సులో పెట్టి అలా వదిలేయకండి. ఓటు వేసి మీ నిర్ణయం చెప్పండి. అది కేవలం గుర్తింపు కార్డు కాదు.. మన జీవితాలను డిసైడ్ చేసే కార్డు. దానిని ఉపయోగించండి. పని చేయని నాయకులకు బుద్ధి చెప్పే యత్నం చేయండి.
News November 11, 2025
జూబ్లీబైపోల్: మోడల్ బూత్‌లు.. మొబైల్ డిపాజిట్ కౌంటర్లు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నియోజకవర్గంలో 5 మోడల్ పోలింగ్ బూత్‌ల వద్ద ఓటర్ అసిస్టెన్స్ బూత్‌లు ఏర్పాటు చేశారు. ఓటర్ల సౌకర్యార్థం, పోలింగ్ బూత్‌లోకి అనుమతి లేని మొబైల్ ఫోన్లను భద్రపరిచేందుకు ప్రత్యేక డిపాజిట్ కౌంటర్లు అందుబాటులోకి వచ్చాయి. ఓటింగ్ సజావుగా జరిగేలా చూసేందుకు, పలు పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికే మాక్ పోలింగ్ (అనుకరణ పోలింగ్) ప్రారంభమైంది.


