News September 3, 2024
HYD: GHMC పరిధిలో నిత్యావసరాల పంపిణీ: సీఎం
జీహెచ్ఎంసీ పరిధిలో వరదలపై సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సచివాలయంలో సమీక్షించారు. ‘హైదరాబాద్‌లో ఎక్కడా చిన్న ఆవాంఛనీయ ఘటన జరగడానికి వీల్లేదు. విద్యుత్, ట్రాఫిక్, తాగునీరు, పారిశుద్ధ్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాలి. కూలీలు పనులు దొరక్క ఇంటి దగ్గరే ఉండిపోతారు. వారిని గుర్తించి బియ్యం, పప్పులు, నిత్యావసర సరకులు పంపిణీ చేయాలి’ అని సీఎం ఆదేశించారు.
Similar News
News September 9, 2024
HYD: హుసేన్‌సాగర్‌లో నిమజ్జనంపై హైకోర్టులో విచారణ
హుసేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనం పై హైకోర్టులో విచారణ జరిగింది. హుసేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయకూడదని గతంలో ఇచ్చిన హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని పిటిషనర్ కోరారు. హైడ్రాను కూడా ప్రతిపాది గా చేర్చాలని పిటిషనర్ కోరారు. హుసేన్‌సాగర్ పరిరక్షణ హైడ్రా బాధ్యత కాబట్టి ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్ కోరారు. రేపు వాదనలు న్యాయస్థానం వింటామంది. చీఫ్ జస్టిస్ బెంచ్ రేపు వాదనలు విననుంది.
News September 9, 2024
HYD: DSC ఫైనల్ కీలో తప్పులు.. అధికారులను కలిసిన అభ్యర్థులు
DSC అభ్యర్థులు ఈరోజు HYDలో ఉన్న పాఠశాల విద్యా కార్యాలయంలోని విద్యాశాఖ అధికారులకు కలిశారు. ఇటీవల విడుదల చేసిన DSCఫైనల్ కీలో కొన్ని తప్పులు ఉన్నాయని, పాఠ్య పుస్తకాల ప్రకారం సమాధానాలు ఇవ్వకుండా కొన్ని సమాధానాలు మార్పు చేశారని అభ్యర్థులు వాపోయారు. ఎలాగైనా తమకు న్యాయం చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. అభ్యర్థులు ఇచ్చిన ఆధారాలను మరోసారి రివ్యూ కమిటీకి సెండ్ చేస్తామని అదికారులు తెలిపారని వారు అన్నారు.
News September 9, 2024
HYD: కాళోజీ నారాయణరావుకు నివాళులర్పించిన స్పీకర్
పద్మవిభూషణ్, ప్రజాకవి, స్వర్గీయ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా అసెంబ్లీ వద్ద ఏర్పాటు చేసిన చిత్రపటానికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాశ్ ఈరోజు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, లెజిస్లేటివ్ సెక్రటరీ నరసింహా చార్యులు పాల్గొన్నారు.