News July 8, 2025

HYD: GHMC హెడ్ ఆఫీస్‌లో 2.5 టన్నుల ఈ-వేస్ట్‌ తొలగింపు..!

image

స్వచ్ఛ్ భారత్ మిషన్‌లో భాగంగా HYD జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్‌లోని ఐటీ విభాగం నుంచి 2.5టన్నుల ఈ-వేస్ట్‌ను అధికారులు తొలగించారు. ఇందులో పాత కంప్యూటర్లు, ప్రింటర్లు, కార్ట్రిడ్జీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి. ఈ-వేస్ట్‌ను ఆసియాలోనే మొదటి LEED ప్లాటినమ్-సర్టిఫైడ్ ఫెసిలిటీ అయిన దుండిగల్ వద్దకు తరలించారు. ఇక్కడే రీసైకిలింగ్ జరుగుతుందని తెలిపారు.

Similar News

News July 8, 2025

‘ఇళ్ల స్థలాలకు అర్హుల వివరాలు ఆన్‌లైన్ చేయాలి’

image

ఇంటి నివేశన స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. మంగళవారం విజయవాడ సీసీఎల్ఏ కార్యాలయం నుంచి ఇళ్ల స్థలాలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రకాశం జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ గోపాలకృష్ణ పాల్గొన్నారు. ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి మాట్లాడుతూ.. అర్హులైన వారి వివరాలు ఆన్లైన్ చేసి, ఆ తర్వాత స్థలాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

News July 8, 2025

NLG: జీపీ వర్కర్లకు మూడు నెలల జీతాలు విడుదల

image

గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఏప్రిల్, మే, జూన్ మాసాల వేతనాలుగా రూ.150 కోట్లు విడుదల చేసింది. ఒకటి రెండు రోజుల్లో జీతాలు వారి ఖాతాల్లోకి జమయ్యే అవకాశం ఉంది. నల్గొండ జిల్లాలోని 868 గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న 3,500 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులకు లబ్ధి చేకూరనుంది.

News July 8, 2025

కంది: మైనారిటీ గురుకులాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

image

సంగారెడ్డి జిల్లా కంది మండలలోని మైనారిటీ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలను జిల్లా కలెక్టర్ ప్రావిణ్య మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా హాస్టల్ వసతులను, ఆహార నాణ్యతను, బోధన విధానాన్ని పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు.