News March 3, 2025
HYD: GIS సర్వేతో రూ.25.60 కోట్ల అదనపు ఆదాయం..!

గ్రేటర్లో మొత్తం 25 లక్షల ఇళ్లు ఉండగా, అందులోని 47,323 ఇళ్ల జీఐఎస్ సర్వే ఇప్పటికే పూర్తయిందని అధికారులు తెలిపారు. అందులో పన్ను పరిధిలోలేని 7,098 (15%) ఇళ్లు, తక్కువ పన్ను చెల్లిస్తోన్న 10,539 నిర్మాణాల లెక్కతేలాయి. తద్వారా జీహెచ్ఎంసీకి రూ.25.60 కోట్ల అదనపు ఆదాయం సమకూరింది. గూగుల్ మ్యాప్ ఆధారంగా జీహెచ్ఎంసీ వెలుపల 8.5 లక్షల ఇళ్లు ఉన్నట్టు, క్షేత్రస్థాయికి వెళ్తే ఆసంఖ్య 12.75 లక్షలు ఉండొచ్చని అంచనా.
Similar News
News March 23, 2025
IPL: మ్యాచ్‌లకు వరుణుడు కరుణించేనా?

ఐపీఎల్‌లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో SRH, RR మధ్య మ్యాచ్ జరుగుతోంది. కాగా మరికాసేపట్లో హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి జిల్లాలో కూడా వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ అంచనా వేసింది. మరోవైపు నగరంపై ఇప్పటికే మబ్బులు పట్టి ఉన్నాయి. దీంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాత్రి 7.30 గంటలకు చెన్నైలో జరిగే CSK, MI మ్యాచుకూ వరుణుడి ముప్పు ఉన్నట్లు సమాచారం.
News March 23, 2025
కత్తెర పట్టుకుంటే రూ.లక్ష ఫీజు తీసుకుంటాడు!

హెయిర్ కట్‌కు సెలూన్ షాప్‌లో ఎంత తీసుకుంటారు? మధ్యతరగతి మనుషులు వెళ్లే సెలూన్లలో రూ.200 లోపే ఉంటుంది. ఎంత లగ్జరీ సెలూన్ అయినా రూ.500-1000 మధ్యలో ఉంటుంది. కానీ ఆలీమ్ హకీమ్ అనే బార్బర్ మాత్రం హెయిర్ కట్ చేస్తే మినిమం రూ.లక్ష తీసుకుంటాడు. మహేశ్, ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్, రజినీ, ధోనీ, కోహ్లీ.. ఇలా ఎంతోమంది సెలబ్రిటీలకు ఆయన హెయిర్ స్టైలిస్ట్ మరి. ఒకప్పుడు సాధారణ బార్బరే క్రమేపీ సెలబ్రిటీగా మారాడు.
News March 23, 2025
నాగర్‌కర్నూల్ జిల్లాకు ఎల్లో అలర్ట్.!

నాగర్ కర్నూల్ జిల్లాకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం నుంచి గురువారం వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదివారం మధ్యాహ్నం విడుదల చేసిన నివేదికలో వాతావరణ శాఖ ఈ వివరాలను వెల్లడించింది. సోమవారం నుంచి గురువారం వరకు జిల్లా వ్యాప్తంగా 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశము ఉందని నివేదికలో పేర్కొన్నారు.