News March 3, 2025
HYD: GIS సర్వేతో రూ.25.60 కోట్ల అదనపు ఆదాయం..!

గ్రేటర్లో మొత్తం 25 లక్షల ఇళ్లు ఉండగా, అందులోని 47,323 ఇళ్ల జీఐఎస్ సర్వే ఇప్పటికే పూర్తయిందని అధికారులు తెలిపారు. అందులో పన్ను పరిధిలోలేని 7,098 (15%) ఇళ్లు, తక్కువ పన్ను చెల్లిస్తోన్న 10,539 నిర్మాణాల లెక్కతేలాయి. తద్వారా జీహెచ్ఎంసీకి రూ.25.60 కోట్ల అదనపు ఆదాయం సమకూరింది. గూగుల్ మ్యాప్ ఆధారంగా జీహెచ్ఎంసీ వెలుపల 8.5 లక్షల ఇళ్లు ఉన్నట్టు, క్షేత్రస్థాయికి వెళ్తే ఆసంఖ్య 12.75 లక్షలు ఉండొచ్చని అంచనా.
Similar News
News March 4, 2025
ఆలపాటి రాజా భారీ విజయం

AP: గుంటూరు-కృష్ణా జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా ఘన విజయం సాధించారు. 50 శాతానికిపైగా ఓట్లు సాధించి విజయం ఖరారు చేసుకున్నారు. ఏడు రౌండ్లు ముగిసేసరికి పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణ్‌పై రాజా 67,252 ఓట్ల మెజారిటీ సాధించారు. మొత్తం 2,41,873 ఓట్లలో 1,18,070 ఓట్లు రాబట్టారు. చెల్లని ఓట్లు 21,577 ఉన్నాయి.
News March 4, 2025
ICC నాకౌట్స్ అంటే హెడ్‌కు పూనకాలే!

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇవాళ ఇండియా, ఆస్ట్రేలియా మధ్య సెమీస్ జరగనుంది. ఇందులో ఆసీస్ విధ్వంసకర ప్లేయర్ ట్రావిస్ హెడ్ బరిలోకి దిగుతున్నారు. ఆయనకు ఐసీసీ టోర్నీల్లో ఘనమైన రికార్డు ఉంది. భారత్‌తో జరిగిన ODI WC సెమీస్‌లో 62, ఫైనల్లో 137, WTC ఫైనల్లో 163 బాదారు. ఈ మూడు మ్యాచుల్లోనూ ఆయన ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నారు. ఇవాళ భారత్‌తో మ్యాచ్ కాబట్టి హెడ్ చెలరేగే ఆస్కారం ఉంది.
News March 4, 2025
పులిగుండాల ప్రాంతంలో రూఫస్ బెల్లిడ్ ఈగల్ ప్రత్యక్షం

పెనుబల్లి మండలం పులిగుండాల ప్రాజెక్టు ప్రాంతంలో అరుదైన ఆసియా డేగ కెమెరాల్లో చిక్కింది. అటవీశాఖ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో ఆసియా ప్రాంతానికి చెందిన వేటాడే పక్షి రూఫస్ బెల్లిడ్ ఈగల్‌గా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఈ విలక్షణమైన పక్షి తల, మెడ, రెక్కలు, వీపు, తోక స్లాటీ నల్లగా ఉంది. దాదాపు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న ఈ పక్షి ఇక్కడ కనిపించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.