News January 31, 2026
HYD: GOOD NEWS.. రూ.5 వేల బహుమతి

రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేయడంలో భయపడవద్దని పోలీసులు తెలిపారు. గాయపడిన వారికి వెంటనే సహాయం చేస్తే ‘గుడ్ సమారిటన్’ కేంద్ర ప్రభుత్వ పథకం కింద రూ.5,000 నగదు బహుమతి, పూర్తిగా చట్ట పరమైన రక్షణ ఉంటుందన్నారు. ఎలాంటి పోలీస్ కేసులు లేదా న్యాయ సమస్యలు ఉండవన్నారు. క్షతగాత్రులను ముందుగా సమీప ఆసుపత్రికి తరలించి, సాయం చేసి ప్రాణదాతలుగా నిలవాలన్నారు.
Similar News
News January 31, 2026
సికింద్రాబాద్‌లో ‘దొంగ’ ప్లాన్ వేశాడు.. పోలీసులకు దొరికాడు!

నకిలీ కలర్ జిరాక్స్ నోట్లను ATM మెషిన్‌లో డిపాజిట్ చేసిన వ్యక్తి అరెస్టైన సంఘటన మహంకాళి PS పరిధిలో చోటుచేసుకుంది. వెస్ట్ బెంగాల్‌కి చెందిన షేక్ మోసిన్ రెజిమెంటల్‌బజార్‌లోని ఓ లాడ్జిలో ఉంటూ నకిలీ కలర్ జిరాక్స్ నోట్లను ప్రింట్ చేసి ఏటీఎం మిషన్‌లో డిపాజిట్ చేసాడు. అకౌంట్లో డబ్బులు డిపాజిట్ కావడం లేదని బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో అసలు విషయం బయటపడడంతో షేక్ మోసిన్‌ను అరెస్ట్ చేశారు.
News January 31, 2026
HYD: నైట్ 10 దాటితే అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే?

రాత్రి 10 దాటాక హైదరాబాద్ మ్యాప్ మారిపోతుంది. అమీర్‌పేటలోని నర్సులు, రాయదుర్గం ఐటీ సపోర్ట్ టీమ్స్ అంతా షేర్డ్ క్యాబ్‌లలో ఇళ్లకు వెళ్తుంటారు. అఫీషియల్ డ్యాష్ బోర్డుల కంటే అమ్మాయిల లైవ్ లొకేషన్ షేర్లు, గ్రూప్ చాట్‌లలో వచ్చే అలర్ట్ లే వారికి అసలైన భద్రత. సెక్యూరిటీ గార్డులు, క్యాబ్ డ్రైవర్లు ఈ నిశ్శబ్ద ప్రయాణంలో తోడుగా నిలుస్తారు. ఇదొక అదృశ్య భద్రతా వలయం.
News January 31, 2026
HYD: నెల రోజులు టైమ్ ఇచ్చారు.. ఇక చూస్కోండి!

ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని షాపుల సీజ్ చేసే కార్యక్రమానికి నెల రోజులు హైడ్రా విరామం ఇచ్చింది. ఈమేరకు షాపుల యజమానులు, వ్యాపార సంఘాల ప్రతినిధులతో హైడ్రా కమిషనర్ శనివారం సమావేశం అయ్యారు. ఈ నెల రోజుల గడువులో అగ్ని ప్రమాదాలకు ఆస్కారం లేకుండా షాపుల వారు అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని ఆదేశించారు. నెల తర్వాత తనిఖీలు ముమ్మరం చేసి, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.


