News October 11, 2025
HYD: GOVT ఆస్పత్రులకు వచ్చిన సహాయకులకు తప్పని కష్టాలు..!

ఉస్మానియా, గాంధీ సహా HYD సిటీలోని పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులతో వచ్చిన అటెండర్లు ఉండడం కోసం సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని పలువురు సహాయకులు వాపోయారు. అసలు సహాయకులను ఒక్కోసారి ఆసుపత్రి పక్కన సైతం పడుకోనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.
Similar News
News October 11, 2025
HYDలో వేసవి విద్యుత్ డిమాండ్ తట్టుకునేలా చర్యలు

HYDలో ఈ వేసవిలో విద్యుత్ డిమాండ్ తట్టుకునేలా చర్యలకు ఉపక్రమించినట్లుగా TGSPDCL ఎండీ ముషారఫ్ అలీ తెలిపారు. ఈ మేరకు రెండు రోజులు వర్చువల్, ఆన్ ఆఫీస్ పద్ధతిలో సర్కిల్ స్థాయిలోని అధికారులకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి దిశనిర్దేశం చేశారు. ఇప్పటి నుంచి ప్రణాళికను అమలు చేయాలని సూచించారు. ఈసారి 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
News October 11, 2025
HYD: భారీ చోరీ బత్తుల ప్రభాకర్ పనేనా..?

అబ్దుల్లాపూర్‌మెట్‌లోని బ్రిలియంట్ ఇంజినీరింగ్ కళాశాలలో భారీ చోరీ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ చోరీ వెనుక బత్తుల ప్రభాకర్ పాత్ర ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇళ్లు, కాలేజీలను టార్గెట్‌గా చేసుకొని చోరీలు చేసే ప్రభాకర్‌పై పలు రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయి. గత నెలలో పోలీస్ ఎస్కార్ట్ నుంచి తప్పించుకున్న ప్రభాకర్ HYD వచ్చి మళ్లీ కాలేజీలను టార్గెట్ చేశారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
News October 11, 2025
గ్రేటర్ HYDలో 14,112 గుంతలు పూడ్చి వేసినట్లు ప్రకటన

గ్రేటర్ HYD వ్యాప్తంగా 16,541 గుంతలు ఉన్నాయని గుర్తించిన అధికారులు, ఇప్పటి వరకు రోడ్లపై 14,112 గుంతలు పూడ్చివేసినట్లుగా తెలిపారు. రోడ్డు సేఫ్టీ చర్యలు వేగంగా చేపడుతున్నట్లు GHMC వివరించింది. జోన్ల వారీగా ఎల్.బీ. నగర్ జోన్ 2,743, చార్మినార్ జోన్ 2,235, ఖైరతాబాద్ 1,987, శేరిలింగంపల్లి 1,576, కూకట్‌పల్లి 2,308, సికింద్రాబాద్ జోన్‌లో 3,263 గుంతలు పూడ్చినట్లు రిపోర్ట్‌ను విడుదల చేసింది.