News August 19, 2024

HYD: GREAT తాను మరణించి.. ముగ్గురికి వెలుగు

image

తాను మరణిస్తూ ముగ్గురు జీవితాల్లో ఓ గృహిణి వెలుగులు నింపారు. ఎల్బీనగర్ శాతవాహన నగర్ కాలనీకి చెందిన కాంతబెన్ పటేల్ 16న కళ్లు తిరిగి ఆకస్మాత్తుగా పడిపోయింది. కుటుంబ సభ్యులు ఎల్బీనగర్‌లో ఓ ఆసుపత్రికి తరలించారు. బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న జీవన్ దాన్ ప్రతినిధులు ఆమె భర్త, కుమారులకు అవయవదానంపై అవగాహన కల్పించి కిడ్నీలు, లివర్‌ను ముగ్గిరికి ట్రాన్స్‌ప్లెంట్ చేశారు.

Similar News

News December 21, 2025

HYD: రేపు నాట్కో పరిశ్రమలో ‘మాక్ ఎక్సర్‌సైజ్’

image

ప్రకృతి విపత్తులు, అగ్ని ప్రమాదాల వేళ అనుసరించాల్సిన రక్షణ చర్యలపై అవగాహన కల్పించేందుకు ఈనెల 22న మేకగూడలోని నాట్కో పరిశ్రమ ఆవరణలో ‘మాక్ ఎక్సర్‌సైజ్’ నిర్వహించనున్నట్లు కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ప్రమాద సమయాల్లో ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు ముందస్తు సన్నద్ధత అవసరమని, అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలనే అంశంపై సిబ్బందికి, అధికారులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తామని వెల్లడించారు.

News December 21, 2025

చలి గుప్పెట్లో ఉమ్మడి రంగారెడ్డి.. 5.1 డిగ్రీల ఉష్ణోగ్రత

image

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. శనివారం మొయినాబాద్ మండలం రెడ్డిపల్లిలో అత్యల్పంగా 5.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటలో 5.8, మౌలాలిలో 7.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో వీస్తున్న చల్లని గాలులకు ప్రజలు గజగజ వణుకుతున్నారు. చలి తీవ్రత దృష్ట్యా వృద్ధులు, చిన్నారులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

News December 20, 2025

22వ తేదీ నుంచి యథావిధిగా ప్రజావాణి: నారాయణ రెడ్డి

image

కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజావాణి’ కార్యక్రమం ఈనెల 22 నుంచి యథావిధిగా ప్రారంభం కానుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ఉదయం 10 గంటల నుంచి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రజలు తమ ఫిర్యాదులు, వినతులతో హాజరు కావచ్చని కలెక్టర్ సూచించారు.