News August 19, 2024
HYD: GREAT తాను మరణించి.. ముగ్గురికి వెలుగు
తాను మరణిస్తూ ముగ్గురు జీవితాల్లో ఓ గృహిణి వెలుగులు నింపారు. ఎల్బీనగర్ శాతవాహన నగర్ కాలనీకి చెందిన కాంతబెన్ పటేల్ 16న కళ్లు తిరిగి ఆకస్మాత్తుగా పడిపోయింది. కుటుంబ సభ్యులు ఎల్బీనగర్‌లో ఓ ఆసుపత్రికి తరలించారు. బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న జీవన్ దాన్ ప్రతినిధులు ఆమె భర్త, కుమారులకు అవయవదానంపై అవగాహన కల్పించి కిడ్నీలు, లివర్‌ను ముగ్గిరికి ట్రాన్స్‌ప్లెంట్ చేశారు.
Similar News
News September 20, 2024
HYD: రేపే లాస్ట్.. CITDలో పోస్ట్ డిప్లొమా కోర్సులు!
HYD బాలానగర్లోని సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (CIT)లో పోస్ట్ డిప్లొమా కోర్సుల దరఖాస్తుకు ఈ నెల 21 వరకు గడువు ఉందని అధికారులు తెలిపారు. డిప్లొమా మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన అభ్యర్థులు అర్హులని చెప్పారు. CITD అడ్మిషన్ డెస్క్ వద్ద శనివారం వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉంటుందని పేర్కొన్నారు. మిగతా వివరాలకు వెబ్ సైట్ www.citdindia.org సందర్శించండి.
News September 20, 2024
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రెండు జాతీయ అవార్డులు
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రెండు జాతీయ అవార్డులు లభించినట్టు జీఎంఆర్ అధికారులు తెలిపారు. భారత పరిశ్రమ సమాఖ్య సీఐఐ ఆధ్వర్యంలో ఈ నెల 12న నిర్వహించిన ఎక్సలెన్స్ ఇన్ మేనేజ్‌మెంట్ కార్యక్రమంలో నేషనల్ ఎనర్జీ లీడర్ ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియెంట్ యూనిట్ అవార్డులు దక్కినట్లు చెప్పారు. వరుసగా ఆరోసారి నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డు దక్కినట్లు తెలిపారు.
News September 20, 2024
HYD: దానం వ్యాఖ్యలపై మీ కామెంట్?
బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్‌పై ఖైరతాబాద్ MLA దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించిన విషయం విదితమే. గతంలో సోనియా గాంధీ పట్ల అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై కేసీఆర్ ఖండించారని గుర్తు చేశారు. స్త్రీలను గౌరవించడం మర్యాదకు సంబంధించిన అంశం అన్నారు. మహిళల పట్ల దిగజారుడు వ్యాఖ్యలు సరికాదన్నారు. దానం వ్యాఖ్యలపై మీ కామెంట్?