News March 15, 2025
HYD: GREAT.. మసీదును ఆసుపత్రిగా మార్చారు!

HYDలో తొలిసారిగా ఓ మసీదును ఆసుపత్రిగా మార్చి మురికి వాడల్లో ఉండే నిరుపేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారు. షాహీన్ నగర్‌లోని ఓమర్-ఎ-షిఫా మసీదులో 25 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేసి, గత ఆరు నెలల్లో 900 మందికి పైగా రోగులను చికిత్స అందించారు. ప్రధానంగా వలస కూలీలు టైఫాయిడ్, డెంగీ, కలరా వంటి వ్యాధులతో ఇక్కడ చికిత్స పొందుతున్నారు.
Similar News
News March 15, 2025
వాళ్లే జనసేన MLAలు: అంబటి రాంబాబు

AP: తన సిద్ధాంతం ఏంటో తెలియని స్థితిలో Dy.CM పవన్ ఉన్నారని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ‘పవన్ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారు. 21 సీట్లు గెలిచి 100% స్ట్రైక్‌రేట్ అని మాట్లాడుతున్నారు. గెలిచిన వారిలో అసలైన జనసేన నేతలు ఎంతమంది? YCP టికెట్ రాని, చంద్రబాబు మనుషులే జనసేన MLAలు. 2 పార్టీలు వాపును చూసి బలం అనుకుంటున్నాయి. జనసేన MLAలు దోపిడీ చేస్తుంటే పవన్ చుక్కలు లెక్కబెడుతున్నారు’ అని విమర్శించారు.
News March 15, 2025
తణుకు: సీఎం సభలో కీ పాయింట్స్.

తణుకులో శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు పర్యటించారు. అందులో కొన్ని కీ పాయింట్స్…
1) పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పార్క్ శుభ్రం చేశారు.
2) మార్కెట్ వ్యాపారస్తులతో ముఖాముఖి.
3) రాగి పిండితో తయారుచేసిన కప్పులను తిలకించారు.
4) తణుకులో 42 పార్కుల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు.
5) అక్టోబర్ 2న చెప్పకుండా వస్తా అన్నారు.
6) ప్రకృతిని నాశనం చేస్తున్న ప్లాస్టిక్.
News March 15, 2025
తడ: లారీ ఢీకొని వ్యక్తి స్పాట్ డెడ్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన తడ మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ కొండప్ప నాయుడు తెలిపిన వివరాల మేరకు.. శుక్రవారం రాత్రి చెన్నై వైపు రోడ్డు మార్షన్‌లో నిలబడిన రవి అనే వ్యక్తిని లారీ వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో వ్యక్తి తలకు తీవ్రగాయాలు కాగా, అక్కడికక్కడే చనిపోయాడు. మృతుని కుమారుడు అజిత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.