News August 7, 2025

HYD: GREAT.. భర్త సహకారంతో PhD

image

HYDకు చెందిన రితిక బజాజ్ భర్త డా.దీపక్ వాగ్రే సహకారం, తల్లిదండ్రుల ప్రేరణతో 20 ఏళ్ల కుమారుడు ఉన్నప్పటికీ ఉన్నత చదువులు చదవాలనే కోరికతో MCom, MBA, BEd, ఏపీ సెట్, PhD పూర్తి చేశానని తెలిపారు. HYDలోని బస్సు డిపోల పనితీరుపై రితిక పరిశోధన చేసి బుధవారం పాలమూరు యూనివర్సిటీలో PhD సమర్పించారు. ఆమెని రిజిస్ట్రార్ ప్రొ.రమేశ్ బాబు, పరీక్షల నియంత్రణ అధికారిణి డా.ప్రవీణ, ప్రిన్సిపల్స్, అధ్యాపకులు అభినందించారు.

Similar News

News August 7, 2025

HYD: యువతలో థైరాయిడ్, షుగర్ టెన్షన్..!

image

30 ఏళ్ల లోపే థైరాయిడ్, షుగర్ రావటం యువతను కలవరపెడుతుంది. గాంధీ, ఉస్మానియా, ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కుషాయిగూడ హెల్త్ సెంటర్ తదితర ప్రాంతాల్లో 25- 28 ఏళ్ల వారిలో థైరాయిడ్, షుగర్ గుర్తించి డాక్టర్లే షాక్ అవుతున్నారు. వీరిని ఆరా తీయగా.. జీవనశైలిలో మార్పులు, ప్రాసెస్‌ఫుడ్, ఆహారపు అలవాట్లు మారటం, ఒత్తిడి, స్లీపింగ్ సైకిల్ మారటం లాంటి కారణాలు ఎక్కువయ్యాయని డాక్టర్లు చెబుతున్నారు.

News August 7, 2025

HYD: తెలుగు విశ్వవిద్యాలయం చరిత్ర ఇదే!

image

దేశంలో భాషా ప్రాతిపదిక మీద 1985 DEC 2న HYDలో తెలుగు యూనివర్సిటీ ఆవిర్భవించింది. 1998లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంగా, 2025 మార్చి 18న సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంగా దీనికి 2సార్లు నామకరణం చేశారు. AP, ఇతర రాష్ట్రాలు, దేశాల్లో తెలుగు భాష అభివృద్ధే ధ్యేయంగా ప్రారంభమైంది. ఇందులో 1985 మార్చి 13న తూమాటి దొణప్ప ప్రత్యేకాధికారిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.

News August 7, 2025

OU: ఎంఫార్మసీ పరీక్షా ఫలితాల విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఫార్మసీ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఫార్మసీ మొదటి, మూడో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.