News October 20, 2024
HYD: GREAT..10 ఏళ్లలో వెయ్యి మందికి కిడ్నీల మార్పిడి

HYD పంజాగుట్ట NIMSలో పదేళ్లలో వెయ్యి మందికి కిడ్నీల మార్పిడి చేసి అరుదైన ఘనత సాధించింది. 2014 నుంచి 2024 వరకు ఈ ఘనత సాధించినట్లు అధికారులు తెలిపారు.1989లో ఆసుపత్రిలో కిడ్నీల మార్పిడి ప్రారంభించగా..అప్పటి నుంచి 2014 వరకు 730 మందికి కిడ్నీల మార్పిడి శస్త్ర చికిత్స చేశారు. జీవన్ దాన్ కేడవర్ ట్రాన్ ప్లాంటేషన్ కార్యక్రమం ప్రవేశపెట్టడంతో కిడ్నీల మార్పిడి ఆపరేషన్ల వేగం గణనీయంగా పెరిగింది.
Similar News
News December 27, 2025
HYD: మూసీ కింద ‘Secret’ నది

మూసీలో చుక్క మురుగు పడకుండా భూమికి 25 అడుగుల లోతులో లండన్ రేంజ్ భారీ సొరంగాలు తవ్వబోతున్నారనేది నగరంలో హాట్ టాపిక్. పైన నీళ్లు పారుతుంటే, కింద సైలెంట్‌గా మురుగు సిటీ దాటి వెళ్లిపోయేలా ఇన్విజిబుల్ డ్రైనేజీ ప్లాన్ రెడీ అవుతోంది. వినడానికి ఇది హాలీవుడ్ సినిమా సెట్టింగ్‌లా ఉన్నా మూసీ ఫ్యూచర్ ఇదేనట. HYD కంపు కొట్టే రోజులు పోయి.. కళ్లు చెదిరే రేంజ్‌లో మెరిసిపోవడం ఖాయమని అధికారులు Way2Newsకు తెలిపారు.
News December 27, 2025
HYD: ఆశ్చర్యం.. కంటైనర్‌లో వైన్ షాప్

లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రధాన రహదారి పక్కనే కంటైనర్‌లోనే వైన్ షాప్ ప్రారంభం కావడం చర్చనీయాంశంగా మారింది. గోల్కొండ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంజూరైన ఓ వైన్ షాప్ రెడీ కాకపోవడంతో దుకాణదారుడు రోడ్డు పక్కనే కంటైనర్ ఏర్పాటు చేసి మద్యం విక్రయాలు ప్రారంభించాడు. ప్రధాన రహదారిపై ఇలా కంటైనర్‌లో వైన్ షాప్ నడపడం చూసిన స్థానికులు, ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
News December 27, 2025
HYD: వీడియో వైరల్ చేస్తామని అమ్మాయికి బెదిరింపులు..!

వాట్సాప్‌లో అనుమానాస్పద లింక్స్ పంపిస్తూ సైబర్ నేరగాళ్లు మోసాలకు దిగుతున్నారని అధికారులు హెచ్చరించారు. ఉప్పల్ పరిధిలో ఓ యువతికి లింక్ పంపి వీడియో కాల్ చేసిన తర్వాత వ్యక్తిగత వీడియోలు వైరల్ చేస్తామని బెదిరించారు. తెలియని లింక్స్, కాల్స్‌కు స్పందించవద్దని, ఓటీపీ, వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని సూచించారు. ఇలాంటి ఘటనలు జరిగితే వెంటనే ఫిర్యాదు చేయాలని తెలిపారు.


