News October 20, 2024
HYD: GREAT..10 ఏళ్లలో వెయ్యి మందికి కిడ్నీల మార్పిడి
HYD పంజాగుట్ట NIMSలో పదేళ్లలో వెయ్యి మందికి కిడ్నీల మార్పిడి చేసి అరుదైన ఘనత సాధించింది. 2014 నుంచి 2024 వరకు ఈ ఘనత సాధించినట్లు అధికారులు తెలిపారు.1989లో ఆసుపత్రిలో కిడ్నీల మార్పిడి ప్రారంభించగా..అప్పటి నుంచి 2014 వరకు 730 మందికి కిడ్నీల మార్పిడి శస్త్ర చికిత్స చేశారు. జీవన్ దాన్ కేడవర్ ట్రాన్ ప్లాంటేషన్ కార్యక్రమం ప్రవేశపెట్టడంతో కిడ్నీల మార్పిడి ఆపరేషన్ల వేగం గణనీయంగా పెరిగింది.
Similar News
News November 3, 2024
HYD నగరంలో మరో స్కైవాక్
హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ శుభవార్త తెలిపింది. HYD నగరంలో మరో స్కైవాక్ అందుబాటులోకి రానుంది. పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ సమీపంలో కొత్తగా స్కైవాక్ నిర్మించనున్నారు. మెట్రో ప్రయాణికుల సౌకర్యార్థం ఆ ప్రాంతంలో ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీ స్కైవాక్ నిర్మించనుంది.
News November 2, 2024
BREAKING: చర్లపల్లి జైలుకు ముత్యాలమ్మ గుడి నిందితుడు
సికింద్రాబాద్ ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం కేసులో న్యాయస్థానం నిందితుడికి రిమాండ్ విధించింది. ప్రధాన నిందితుడైన సల్మాన్ సలీంకు 14 రోజులు రిమాండ్ విధించడంతో అతడిని చర్లపల్లి జైలుకు పోలీసులు తరలించారు. ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం కేసు విచారణను సిట్‌కు బదిలీ చేయగా ఈ ఘటనపై సిట్ 3 కేసులను నమోదు చేసింది.
News November 2, 2024
HYD: యువతిపై అత్యాచారం
HYD ఘట్‌కేసర్ పరిధిలో యువతిపై అత్యాచారం జరిగింది. సీఐ పి.పరశురాం తెలిపిన వివరాలు.. ఓ మార్ట్‌లో పని చేసే యువతిపై కజా బషీర్ (35) అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయట పెడితే చంపుతానని ఆమెను బెదిరించాడు. ఈ క్రమంలో బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పడంతో ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.