News February 18, 2025

HYD: GREAT..13 ఏళ్లుగా కడుపు నింపుతున్నాడు!

image

HYDలో ఓ వ్యక్తి ఏకంగా 13 ఏళ్లుగా పేదల కడుపు నింపుతున్నాడు. పేదల బాధను చూసిన అతడు ఆకలికి మతం లేదంటాడు. ఆయనే సామాజికవేత్త అజహర్ మాక్సూసి. చంచల్ గూడ, డబిర్‌పూర ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద కూడు, గూడులేని వారికి 4,720వ రోజు పేదలకు భోజనం పెట్టాడు. సేవ చేయడంలోనే తన సంతోషాన్ని వెతుక్కుంటున్నానని తెలిపారు. తన సేవలను అభినందిస్తూ ప్రజలు ‘Keep it Bhai’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Similar News

News October 22, 2025

BREAKING: HYD: అమీర్‌పేట్ సదర్ ఉత్సవాల్లో అపశృతి

image

HYD అమీర్‌పేట్ మండలం మధురానగర్ పీఎస్ పరిధిలో నిర్వహించిన సదర్ ఉత్సవాల్లో ఈరోజు అపశృతి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఎల్లారెడ్డిగూడలో నిర్వహించిన సదర్ ఉత్సవాల్లో అదుపుతప్పిన దున్నరాజు జనాల్లోకి దూసుకెళ్లడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 22, 2025

BREAKING: HYD: సంపులో పడి చిన్నారి మృతి

image

RR జిల్లా షాబాద్ మండలం బోడంపహాడ్‌లో ఈరోజు విషాదం నెలకొంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మల్లేశ్, స్వాతి దంపతులు వారి కుమార్తె రక్షిత(18 నెలలు)ను నానమ్మ దగ్గర వదిలి కూలి పనులకు వెళ్లారు. చిన్నారి ఆడుకుంటూ ఇంటి ముందు నిర్మాణంలో ఉన్న సంపులో పడిపోయింది. చిన్నారి చేతిలో ఉన్న పెన్ను సంపులో కనిపించడంతో లోపలికి చూశారు. చిన్నారి విగతజీవిగా కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

News October 22, 2025

జూబ్లీహిల్స్ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్‌కు ఓటేయండి: సీతక్క

image

జూబ్లీహిల్స్ పరిధి బోరబండలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరఫున మంత్రి సీతక్క ఈరోజు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలని ఓటర్లకు సూచించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు అవకాశం ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందని చెప్పారు. కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ తదితరులు ఉన్నారు.