News February 18, 2025

HYD: GREAT..13 ఏళ్లుగా కడుపు నింపుతున్నాడు!

image

HYDలో ఓ వ్యక్తి ఏకంగా 13 ఏళ్లుగా పేదల కడుపు నింపుతున్నాడు. పేదల బాధను చూసిన అతడు ఆకలికి మతం లేదంటాడు. ఆయనే సామాజికవేత్త అజహర్ మాక్సూసి. చంచల్ గూడ, డబిర్‌పూర ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద కూడు, గూడులేని వారికి 4,720వ రోజు పేదలకు భోజనం పెట్టాడు. సేవ చేయడంలోనే తన సంతోషాన్ని వెతుక్కుంటున్నానని తెలిపారు. తన సేవలను అభినందిస్తూ ప్రజలు ‘Keep it Bhai’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Similar News

News February 28, 2026

కోకాపేట భూములు శారదా పీఠానికే ఇవ్వండి: CM రేవంత్

image

TG: కోకాపేటలోని భూమిని శారదా పీఠానికే కొనసాగించాలని CM రేవంత్ నిర్ణయించారు. పీఠం భూములను జలమండలికి కేటాయించడంతో వివాదం మొదలైంది. ఇవాళ హరీశ్ రావు సైతం అక్కడికి వెళ్లి మద్దతు తెలిపారు. అయితే కేటాయింపు భూముల్లో సాగుతున్న నిర్మాణ పనుల విషయాన్ని ముందే ఎందుకు చెప్పలేదని అధికారులపై CM ఆగ్రహం వ్యక్తం చేశారు. జలమండలికి భూముల కేటాయింపు రద్దు చేసి, శారదా పీఠానికే కొనసాగించాలని ఆదేశించారు.

News February 28, 2026

KNR: పసిప్రాణాల ఇంజక్షన్ విలువ రూ.32 కోట్లు

image

టీం ఫంకీ జోన్ అనే పేరుతో కరీంనగర్ కు చెందిన యువకులు పసిపిల్లల ప్రాణాలు కాపాడడానికి ఈరోజు వేములవాడలో ఫండ్స్ కలెక్ట్ చేశారు. బెల్లంపల్లికి చెందిన శివ, సహస్ర పిల్లలకు (SMA) వ్యాధి వచ్చింది. వీరి ప్రాణాలు కాపాడాలంటే రెండు ఇంజక్షన్లకు రూ.32 కోట్లు ఖర్చు అవుతుందని అన్నారు. వీరి ప్రాణాలను నిలబెట్టడానికి ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నామని, ఇప్పటివరకు రూ.30 లక్షలకు కలెక్ట్ చేసినట్లు తెలిపారు.

News February 28, 2026

వైద్యాధికారులకు నోటీసులు పంపుతాం: DMHO

image

స్కానింగ్ రెన్యువల్ చేయని సీహెచ్సీలు స్కానింగ్ సెంటర్లకు నోటీసులు జారీ చేసేందుకు తీర్మానించినట్లు జిల్లా వైద్యాధికారి సుజాత తెలిపారు. జిల్లాస్థాయి సలహా సంఘంతో పిండ, లింగ నిర్ధారణపై జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్కానింగ్ రెన్యువల్‌లో నిర్లక్ష్యంగా ఉన్న వెంకటాచలం, ఉదయగిరి సీహెచ్సీలకు, మార్పు చేయుటలో నిర్లక్ష్యంగా ఉన్న పొదలకూరు, కావలి ఫోకస్ డయాగ్నస్టిక్ సెంటర్‌కు నోటీసులు జారీ చేస్తామన్నారు.