News August 9, 2024

HYD: HCA లీగ్ మ్యాచ్లు నిర్వహించొద్దు: హైకోర్టు

image

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లీగ్ మ్యాచ్లు నిర్వహించొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. HCA అపెక్స్ కౌన్సిల్ రిలీజ్ చేసిన ప్రకటన ఆధారంగా ఎలాంటి మ్యాచ్లు నిర్వహించొద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆటగాళ్ల ఎంపిక నిమిత్తం లీగ్ మ్యాచ్లను నిర్వహించేందుకు హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ విడుదల చేసిన ప్రకటనను సవాలు చేస్తూ హైదరాబాద్ చార్మినార్ క్రికెట్ క్లబ్ దాఖలు చేసిన పిటీషన్‌ను విచారించింది.

Similar News

News February 11, 2026

3pm రంగారెడ్డి అప్‌డేట్.. దూసుకొచ్చిన ఆమన్‌గల్

image

RR మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఊపందుకుంది. 2 తర్వాత ఓటర్లు కేంద్రాలకు కదిలారు. జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో 1, 2 మినహా మిగతా వార్డుల్లో పోలింగ్ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. మ.3గం. వరకు జిల్లాలో 68.77% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా ఆమనగల్లులో 76.33%, చేవెళ్ల 73.04% ఇబ్రహీంపట్నం 68.6%, మొయినాబాద్ 69.79, శంకర్‌పల్లి 65.19, షాద్‌నగర్‌లో 65.25% నమోదైంది. పోలింగ్‌కు మరో 1:10 గం. సమయం మిగిలి ఉంది.

News February 11, 2026

RR: 57.68%తో చేవెళ్ల టాప్.. మొత్తం ఎంతంటే!

image

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కాస్త ఊపందుకుంది. 12 తర్వాత ఓటు వేసేందుకు ఓటర్లు కేంద్రాల వద్ద బారులు తీరారు. జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో 1, 2 మినహా మిగతా వార్డుల్లో పోలింగ్ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు జిల్లాలో 52.57% పోలింగ్ నమోదైంది. ఆమనగల్లు 54.4%, చేవెళ్ల 57.68,% ఇబ్రహీంపట్నం 52.73%, మొయినాబాద్ 49.67, శంకర్‌పల్లి 49.63, షాద్‌నగర్ 52.43% నమోదైంది.

News February 11, 2026

రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల టాప్

image

రంగారెడ్డి జిల్లాలోని 6 మున్సిపాలిటీల వ్యాప్తంగా ఉ.11గం. వరకు మొత్తం 30.11% పోలింగ్ నమోదైంది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 31.06%, ఆమనగల్లులో 25.58, చేవెళ్లలో 34.02, మెయినాబాద్‌లో 26.97, శంకర్‌పల్లిలో 32.05, షాద్‌నగర్‌లో 32.5% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. యువత ఓటు హక్కుని వినియోగించుకుని ప్రజాసామ్య స్ఫూర్తిని చాటాలని సూచించారు. ఇప్పటివరకు చేవెళ్లలో ఇప్పటి వరకు అత్యధికంగా ఓటింగ్ నమోదైంది.