News February 24, 2025

HYD: HICCలో బయో ఏషియా సదస్సు

image

జీవ విజ్ఞాన రంగంలోని పరిశోధకులు, పారిశ్రామికవేత్తలు, విధాన రూపకర్తలను ఒక వేదికపైకి తీసుకొచ్చే బయో ఏషియా సదస్సుకు రంగం సిద్ధమైంది. 22వ సదస్సు ఈ నెల 25, 26 తేదీల్లో HYDలోని హెచ్‌ఐసీసీ వేదికగా జరగనుంది. 50 దేశాలకు చెందిన దాదాపు 3,000 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు. CM రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా రేపు సదస్సు ప్రారంభం కానుంది.

Similar News

News March 22, 2025

HYD: పదోన్నతి.. ఇంతలోనే అడిషనల్ DCP మృతి

image

హయత్‌నగర్‌లో ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో అడిషనల్ DCP బాబ్జీ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల పోలీస్ సిబ్బంది తీవ్ర సంతాపం ప్రకటించింది. మార్చి 18న ఆయన అడిషనల్ SP ర్యాంక్ ఆఫీసర్‌గా పదోన్నతి పొందారు. ఇంతలోనే మృతి చెందడం కుటుంబీకులు జీర్ణించుకోలేకపోతున్నారు. పెద్ద అంబర్‌పేటలో నివాసం ఉండే బాబ్జీ‌కి ఉదయం వాకింగ్ చేయడం అలవాటు. ఈ క్రమంలోనే హైవే మీద రోడ్డు దాటుతుండగా బస్సు ఢీ కొట్టింది. 

News March 22, 2025

HYD: భార్య వీడియోలు భర్తకు పంపి.. బ్లాక్ మెయిల్!

image

విదేశంలో HYD యువతికి వేధింపులు ఎదురయ్యాయి. శ్రీకృష్ణానగర్‌ వాసి 2018లో పనికోసం దుబాయ్‌కు వెళ్లింది. అక్కడ పరిచయమైన అబూబాకర్ ఆమె వ్యక్తిగత వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేశాడు. 2020లో బాధితురాలు HYD వచ్చేసింది. అయినా అతడి వేధింపులు ఆగలేదు. ఏకంగా ఆమె ఇంటి వద్దకు వచ్చాడు. కాల్ చేసినా ఆమె బయటకురావడం లేదని ఆ వీడియోలు ఆమె భర్తకు పంపాడు. ఈ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News March 22, 2025

రేపు ఉప్పల్‌లో SRH VS RR.. ఇవి నిషేధం!

image

⊘కెమెరాలు, రికార్డింగ్‌ పరికరాలు
⊘కత్తులు, గన్నులు, మారణాయుధాలు
⊘టపాసులు, సిగరెట్, అగ్గిపెట్టె, లైటర్
⊘మద్యపానం, కూల్‌డ్రింక్స్, బయటి ఆహార పదార్థాలు
⊘పెంపుడు జంతువులు
⊘హ్యాండ్ బ్యాగ్స్, ల్యాప్‌టాప్స్, సెల్ఫీ స్టిక్స్
⊘హెల్‌మెట్, బైనాక్యులర్‌ స్టేడియం లోపలికి తీసుకురావొద్దని <<15844156>>రాచకొండ<<>> పోలీసులు హెచ్చరిస్తున్నారు.
SHARE IT

error: Content is protected !!