News February 4, 2026

HYD: HMWSSB స్మార్ట్ వాల్వ్స్ అంటే ఏంటి?

image

జలమండలి అధికారులు నీటి సరఫరాలో మనుషుల ప్రమేయం తగ్గించి, రిమోట్ కంట్రోల్‌తో పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ చేస్తున్నారు. ఎక్కడైనా పైపు పగిలితే సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఆ లైన్‌ను కట్ చేసి ప్రత్యామ్నాయ మార్గంలో నీటిని పంపిస్తుంది. దీర్ఘకాలంగా బిల్లులు కట్టని వారి కనెక్షన్లను ఆఫీసు నుంచే రిమోట్ ద్వారా ‘లిమిటెడ్ సప్లై’ మోడ్‌లోకి మార్చవచ్చు, నీటి వృథాను అరికట్టడం, <<19047299>>100%<<>> వసూళ్లను సాధించడం దీని లక్ష్యం.

Similar News

News February 4, 2026

స్వామి వివేకానంద HYD పర్యటనకు 133 ఏళ్లు

image

స్వామి వివేకానంద భాగ్యనగరానికి వచ్చి ఈ ఏడాదితో 133 ఏళ్లు పూర్తికావొస్తున్నాయి. ఈ నేపథ్యంలో రామకృష్ణ మఠం శాఖ ‘వివేక సూర్యోదయ సప్తాహం’ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. కార్యక్రమాలన్నీ సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీ క్యాంపస్‌లోని వివేకానంద ఆడిటోరియంలో జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనవచ్చని మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద మహారాజ్ తెలిపారు. ఆయన ఇక్కడకి వచ్చినప్పుడు ఈ కాలేజీలోనే ప్రసంగించారు.

News February 4, 2026

బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్

image

హీరోయిన్ ఈషా రెబ్బా బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లపై కొందరు వ్యక్తులు అత్యంత అసభ్యకరంగా, కించపరిచేలా కామెంట్స్ చేస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా తన గౌరవానికి భంగం కలిగిస్తున్న వారిని గుర్తించి, కఠినచర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు.

News February 4, 2026

HYD: రూ.20,930 శాలరీలో రూ.11,930 కమీషన్

image

​”నోరు తెరిస్తే పనిలోంచి తీసేస్తాం.. ఇచ్చింది పుచ్చుకొని పడి ఉండండి” అంటూ GHMC ఎంటమాలజీ కార్మికులను కాంట్రాక్ట్ ఏజెన్సీలు నిలువునా దోచుకుంటున్నాయి. నెలకు రావాల్సిన ₹20,930 జీతంలో, ఏకంగా ₹11,930 కమీషన్ కింద నొక్కేస్తూ కేవలం ₹9,000 మాత్రమే చేతిలో పెడుతున్నారని సమాచారం. 2021 నుంచి సాగుతున్న ఈ ‘దందా’పై కార్మికులు గళమెత్తినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం గమనార్హం.