News March 23, 2024
HYD: Holi ఆడుతున్నారా.. జాగ్రత్త..!

ఈ నెల 25న హోలీ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని HYDలోని 3 కమిషనరేట్ల పరిధి పోలీసులు సూచిస్తున్నారు. రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో గుర్తుతెలియని వ్యక్తులు, వాహనాలపై రంగులు చల్లకూడదని పేర్కొన్నారు. న్యూసెన్స్ చేస్తే సహించేది లేదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే వైన్స్, బార్లు, పబ్‌లు, కల్లు కంపౌండ్‌లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. SHARE IT
Similar News
News October 23, 2025
రంగారెడ్డి: బెగ్గింగ్ చేసి మరీ బోర్ రిపేర్!

తమ హయాంలో ఎంతో అభివృద్ధి జరిగిందని పాలకులు చెబుతుంటారు. ఇది సాదారణమే కానీ, తండాల్లో చిన్న సమస్య వస్తే GPల్లో నిధులు లేని దుస్థితి కనిపిస్తోంది. అవును.. తలకొండపల్లి మం. హర్యానాయక్ తండాలో నీటి మోటరు కాలిపోయింది. పంచాయతీ కార్యదర్శిని అడిగితే నిధులు లేవని సమాధానం వచ్చింది. దీంతో నీటి సమస్య తీర్చాలని కొందరు యువకులు ఇంటింటికి తిరిగి భిక్షాటన చేశారు. జమ అయిన రూ.5000తో బోరు రిపేర్ చేయించడం గమనార్హం.
News October 23, 2025
జూబ్లీహిల్స్‌లో 100 మంది రౌడీషీటర్లు!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ పోలీసులు రౌడీ షీటర్ల వివరాలపై ఆరా తీస్తున్నారు. ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా నిఘా పెట్టారు. నియోజకవర్గ పరిధిలో 100 మంది రౌడీ షీటర్లు ఉన్నట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. జూబ్లీహిల్స్ PS పరిధిలో ఇద్దరు, సనత్‌నగర్‌లో ఒక్కరు, మధురానగర్‌లో 19 మంది, గోల్కొండలో ఒక్కరు, బోరబండలో 71 మంది, టోలిచౌకిలో నలుగురు, పంజాగుట్టలో ఇద్దరు ఉన్నారు.
News October 23, 2025
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు గుడ్ న్యూస్

BA, B.COM, BSC చదువుతున్న విద్యార్థులకు అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ గుడ్‌న్యూస్ ప్రకటించింది. 2019-24 మధ్యలో చేరిన విద్యార్థులు ట్యూషన్ ఫీజు చెల్లించే గడువును పొడిగించింది. విద్యార్థులు తమ ట్యూషన్ ఫీజును నవంబర్ 13లోపు చెల్లించాలని స్టూడెంట్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. వర్సిటీ వెబ్ సైట్‌లో పూర్తి వివరాలున్నాయన్నారు. సందేహాలుంటే 040-23680333 నంబరుకు ఫోన్ చేయాలని కోరారు.