News August 17, 2024
HYD: HYDRA.. అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది!

ప్రభుత్వ భూముల రక్షణ, విపత్తు నిర్వహణ కోసం అతిపెద్ద సంస్థగా ఏర్పడిన HYDRA అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షణలో HYDRA కమిషనర్ రంగనాథ్ IPS నేతృత్వంలో కొనసాగుతోంది. ఇద్దరు ఎస్పీలు, పలు విభాగాల అధికారులతో కలిపి దాదాపు 3,000 మందితో సంస్థ మరింత బలపడనుంది. ఇప్పటికే HYDలో ఆక్రమణలపై ఉక్కు పాదం మోపుతున్నారు.
Similar News
News November 20, 2025
HYD: చలిమంట వేసుకునే క్రమంలో ప్రమాదం

కొంపల్లిలోని పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధి గుండ్లపోచంపల్లిలో చలిమంట వేసుకునే క్రమంలో ప్రమాదం చోటుచేసుకుంది. పెయింటర్లు నూర్ ఆలం(36), అశ్రఫ్ అలీ (27) ఇంటికి వెళ్లే సమయంలో చలిమంట వేసుకోగా వారి వద్ద మిగిలిన టర్పెంట్ ఆయిల్‌ని మంటలో వేశారు. దీంతో ఒక్కసారిగా మండి ఇద్దరికీ మంటలు అంటుకున్నాయి. మెరుగైన చికిత్స నిమిత్తం వారిని గాంధీ హాస్పిటల్‌కి తరలించారు. వీరిద్దరూ బిహార్‌కు చెందిన వారు.

News November 19, 2025
HYD: పూజిత చనిపోయింది.. పోలీసుల ప్రకటన

HYD ఘట్కేసర్ పరిధి అవుషాపూర్‌లోని <<18219517>>అనురాగ్ యూనివర్సిటీలో<<>> BSC నర్సింగ్ 3rd ఇయర్ చదువుతున్న పూజిత(22) ఈనెల 6న కాలేజీ బిల్డింగ్‌పై నుంచి దూకి సూసైడ్ అటెంప్ట్ చేసిన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలైన ఆమె పంజాగుట్ట నిమ్స్‌లో 13 రోజులుగా చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి చనిపోయిందని ఘట్కేసర్ పోలీసులు ఈరోజు తెలిపారు. కాగా పూజిత స్వగ్రామం నాగర్‌కర్నూల్ జిల్లా తుమ్మలవాడ అని చెప్పారు.