News July 23, 2024
HYD: IAS స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై నిరసనలు..!

HYD అశోక్ నగర్, ఎల్బీనగర్, ఉప్పల్ సహా పలు ప్రాంతాల్లో దివ్యాంగులు రోడ్డెక్కారు. సీనియర్ IAS అధికారిణి స్మిత సబర్వాల్ దివ్యాంగుల రిజర్వేషన్ పై చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ నిరసనలు తెలిపారు. దివ్యాంగులకు రిజర్వేషన్ అవసరం లేదని చెప్పే హక్కు స్మిత సబర్వాల్కు లేదని వారు మండిపడ్డారు. తమను ఆమె కించపరిచారని దివ్యాంగుల జాతీయ వేదిక నాయకులు రాము, రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News December 6, 2025
గ్లోబల్ సమ్మిట్: రూ.250 లక్షల కోట్లే లక్ష్యం!

భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ కేవలం పెట్టుబడుల సమావేశం కాదు. ఇది రాష్ట్ర ఆర్థిక విధానాల విప్లవం. 2047 నాటికి $3 ట్రిలియన్ (సుమారు ₹250 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థ దిశగా ముఖ్యమంత్రి ఆవిష్కరించే ‘తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్’ సారాంశమే ఈ సమ్మిట్. తయారీ, టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో పటిష్ఠమైన, స్థిరమైన నూతన పాలసీలను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది.
News December 6, 2025
HYD: దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం

ఇండిగో విమానాల వరుస రద్దులతో దేశవ్యాప్తంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో.. రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసరంగా ప్రీమియం రైళ్లలో అదనపు కోచ్లు జత చేస్తూ ప్రయాణికుల రద్దీని తగ్గించే చర్యలు ప్రారంభించింది. దక్షిణ, తూర్పు, ఉత్తర, పశ్చిమ సహా పలురైల్వే జోన్లు మొత్తం 37 రైళ్లకు 116 అదనపు కోచ్లు అమర్చి.. వచ్చే 10వ తేదీ వరకు ప్రయాణానికి ప్రత్యామ్నాయ సౌలభ్యాన్ని కల్పిస్తున్నాయి.
News December 6, 2025
HYDలో పెరిగిన పాదచారుల ‘రోడ్కిల్’

HYDలో ఫుట్పాత్ల లేమి, ఆక్రమణల కారణంగా పాదచారుల మరణాలు పెరుగుతున్నాయి. 2024లో సుమారు 400 మంది మరణించగా, 1,032 ప్రమాదాలు జరిగాయి. 2025లో ఇప్పటి వరకు 510 మరణాలకు ఇదే కారణం. ఐటీ కారిడార్లలో సైతం కిలోమీటరుకు సగటున 7 అడ్డంకులు ఉండటంతో ఉద్యోగులు నడవలేకపోతున్నారు. 7,500 స్టాల్స్ తొలగించినా, సమస్య పరిష్కారం కాలేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది.


