News October 17, 2025
HYD: IPS బ్యాచ్ పాసింగ్ పరేడ్‌కు BSF DG

HYDలోని SVP నేషనల్ పోలీస్ అకాడమీలో 77వ RR IPS బ్యాచ్ శిక్షణ పూర్తైంది. మొత్తం 190 మంది IPSలు, అందులో 65మంది మహిళలు (36%) ఉన్నారు. 50% మంది ఇంజినీరింగ్ నేపథ్యంతో అభ్యర్థులు ఉన్నారు. పరేడ్‌కు BSF DG దల్జిత్ సింగ్ చౌదరి ముఖ్య అతిథిగా హాజరై, ప్రతిభావంతులైన ట్రైనీలకు అవార్డులు అందజేయానున్నారు. 49 వారాల పాటు కఠిన శిక్షణ పూర్తిచేసిన అధికారులు త్వరలో బాధ్యతలు చేపడతారు.
Similar News
News October 17, 2025
జూబ్లీ బై పోల్: పనులను నిలిపివేయనున్న కాంట్రాక్టర్లు

జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు తమ నిరసన వ్యక్తం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈరోజు మ.3 గంటలకు జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్‌లో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ బయ్‌కాట్ చేయాలని వారు నిర్ణయించుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా వాళ్లు పేర్కొన్నారు. సమావేశం తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
News October 17, 2025
గోషామహల్: కబ్జాలను తొలగించిన హైడ్రా

ఆసిఫ్‌నగర్ మండల పరిధిలోని కుల్సుంపూర్ విలేజ్‌లోని సర్వే నం.50లో ఆక్రమణలను హైడ్రా తొలగించింది. అశోక్‌సింగ్ అనే వ్యక్తి ఆక్రమణలో ఉన్న మొత్తం 1.30 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వ భూమిని ఆక్రమించి.. అందులో షెడ్డులు వేసి విగ్రహతయారీదారులకు అద్దెకు ఇస్తున్నట్లు గుర్తించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా చర్యలు చేపట్టింది.
News October 17, 2025
HYD: ఏపీ మహిళపై అత్యాచారం చేసింది ఇతడే

రైలులో ప్రయాణికురాలిపై <<18009296>>అత్యాచారం<<>> కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడిని గుంటూరు రైల్వే పోలీసులు తెనాలిలో అదుపులోకి తీసుకన్నారు. పల్నాడులోని సత్తెనపల్లి పరిధి లక్కరాజుగార్లపాడుకు చెందిన జోన్నలగడ్డ రాజారావుగా గుర్తించారు. 2 నెలల క్రితం కేరళకు చెందిన మహిళపైనా అతడు అత్యాచారం చేసినట్లు వెల్లడైంది. మంగళవారం సికింద్రాబాద్ వస్తున్న సంత్రగాచి ఎక్స్‌ప్రెస్‌లో మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు.