News January 1, 2025
HYD: JAN 3 నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు
ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహాసభలు 2025 జనవరి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు హైదరాబాద్‌లోని HICC వేదికగా జరుగుతాయి. ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారందరినీ ఏకం చేసి తెలుగు భాష, సంప్రదాయం, సాహిత్యం, కళలను బలోపేతం చేయడంతో పాటు వాటిని భవిష్యత్తు తరాలకు అందించే లక్ష్యంతో నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వహకులు తెలిపారు.
Similar News
News January 21, 2025
AISF రంగారెడ్డి జిల్లా గర్ల్స్ కన్వీనర్‌గా శ్రావణి
అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) రంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సమావేశం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పవన్, వంశి అధ్యక్షతన శంషాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగింది. సమావేశంలో జిల్లా గర్ల్స్ కన్వీనర్‌గా కే శ్రావణిని నియమించారు. ఈ సమావేశనికి ముఖ్య అతిథులుగా జిల్లా నిర్మాణ బాధ్యుడు పానుగంటి పర్వతాలు, AISF రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మణికంఠ రెడ్డి, లక్ష్మణ్, ఉపాధ్యక్షులు క్రాంతి పాల్గొన్నారు.
News January 21, 2025
శంషాబాద్: రికార్డు బ్రేక్ చేసిన ఎయిర్ పోర్ట్
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2025 జనవరి 18వ తేదీన ఒకే రోజు 94,630 మంది ప్రయాణికులను 607 విమానాల్లో గమ్యస్థానాలకు చేర్చి గత రికార్డును బ్రేక్ చేసినట్లుగా RGIA బృందం తెలిపింది. గత రికార్డు 2024 డిసెంబర్ 22వ తేదీన ఒకేరోజు 92,000 మంది శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రయాణించారు. గత డిసెంబర్ నెలలో 27 లక్షల మంది ప్రయాణించగా అందులో 23 లక్షల మంది స్వదేశీయులే అని తెలిపింది.
News January 21, 2025
HYD: రైల్వే ట్రాక్‌పై అమ్మాయి తల, మొండెం (UPDATE)
జామై ఉస్మానియాలో ట్రాక్ మీద అమ్మాయి మృతదేహం కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాచిగూడ రైల్వే ఇన్‌స్పెక్టర్ ఎల్లప్ప అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతురాలు సిద్దిపేట జిల్లా పెద్ద కోడూరు గ్రామానికి చెందిన భార్గవి(19)గా గుర్తించారు. OU ఆంధ్ర మహిళ సభలోని హాస్టల్‌లో ఉంటూ ఇంటర్ సెకండియర్ చదువుతున్నట్లు వెల్లడించారు. <<15212047>>ఆత్మహత్య<<>>కు గల కారణాలు తెలియాల్సి ఉంది.