News August 13, 2025
HYD: JNTUలో రెండో సెమిస్టర్ ఫలితాల విడుదల

బీ ఫార్మసీకి సంబంధించి రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను ఈరోజు HYD జేఎన్టీయూ అధికారులు విడుదల చేశారు. నాలుగో సంవత్సరం రెండో సెమిస్టర్‌కి సంబంధించిన ఫలితాలను విడుదల చేశారు. 5,573 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 5,433 మంది విద్యార్థులు హాజరయ్యారు. అందులో 4,215 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని అధికారులు వెల్లడించారు. 77.52 శాతం పాస్ పర్సంటేజ్ నమోదైందని వారు తెలిపారు.
Similar News
News August 31, 2025
HYD: చిట్టి గణపయ్యకు చిన్న జీపు

వినాయకచవితి నవరాత్రుల్లో భాగంగా 5వ రోజు నగరంలో నిమజ్జనాల ఊరేగింపులు ఉత్సాహంగా జరుగుతున్నాయి. పాతబస్తీ మాదన్నపేటలో ఓ చిన్నారి చిట్టి గణపయ్య కోసం చిన్న జీపును సిద్ధం చేసింది. గణపయ్యను ఆ వాహనం మీద ఊరేగింపు చేస్తూ నిమజ్జనం చేశారు. ఈ దృశ్యం భక్తులను విశేషంగా ఆకట్టుకొంది.
News August 31, 2025
HYD: భూగర్భ విద్యుత్ లైన్ల నిర్మాణం ఎప్పుడు?

HYDలో భూగర్భ విద్యుత్ లైన్ల నిర్మాణం చేపడతామని ప్రభుత్వం అనేకసార్లు తెలిపింది. కానీ..ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. దాదాపు రూ.15 వేల కోట్లు అవసరం ఉన్నట్లు అంచనా వేస్తున్నప్పటికీ ప్రారంభం కాలేదు. తరచూ ఓవర్ హెడ్‌లైన్లు తెగి పడటంతో అనేకచోట్ల ప్రాణాలు పోతున్నాయి. ఇటీవల జరిగిన ఘటనలు బాధిస్తున్నాయి. వెంటనే ఎలక్ట్రిసిటీ గ్రౌండ్ లైన్ కేబుల్స్ పనులు ప్రారంభించాలని కోరుతున్నారు.
News August 31, 2025
HYD: పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన SCR

అనివార్య కారణాల వళ్ల పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లుగా HYD SCR అధికారులు తెలిపారు. పూర్ణ నుంచి అకోలా, అకోలా నుంచి పూర్ణా వెళ్లే 77613 రైలు రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు జైపూర్ హైదరాబాద్, తిరుపతి, అదిలాబాద్ రైళ్లను సైతం డైవర్ట్ చేస్తున్నట్లుగా వెల్లడించింది. ఈ నేపథ్యంలో రైలులో ప్రయాణం ప్లాన్ చేసుకునేవారు షెడ్యూల్ చూసుకోవాలని సూచించారు.