News August 8, 2024
HYD: JNTUH ద్వారా అమెరికా యూనివర్సిటీల్లో!

HYD కూకట్పల్లి JNTUH ద్వారా అమెరికా యూనివర్సిటీల్లో ప్రవేశాలకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అమెరికా యూనివర్సిటీలతో ఇప్పటికే MOU ఒప్పందాలు జరిగాయి. MOUలతో ఇంటిగ్రేటెడ్ బీటెక్ MS డిగ్రీ ఐదేళ్లకే పూర్తి చేసుకోవచ్చు. మూడేళ్లు JNTU, ఒక ఏడాది బీటెక్, మరో ఏడాది ఎమ్మెస్ అమెరికాలో చదివితే సరిపోతుంది. రెగ్యులర్ B.Tech, MS చేసేందుకు ఆరేళ్లు పడుతుండగా.. దీంతో ఐదేళ్లు మాత్రమే పట్టనుంది.
Similar News
News December 11, 2025
రంగారెడ్డి: 6 ఏకగ్రీవం.. 168 GPలకు ఎన్నిక

రంగారెడ్డి జిల్లాలో నేడు సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో భాగంగా జిల్లాలోని 7 మండలాల పరిధి 174 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 6 GPలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో గురువారం 168 గ్రామాల్లో పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం ఒంటిగంటతో పోలింగ్ ముగుస్తుంది. మధ్యాహ్నం 3 తర్వాత ఫలితాలు వస్తాయి. 530 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక 1340 వార్డులు ఉండగా.. ఇప్పటికే 190 ఏకగ్రీవం అయ్యాయి.
News December 7, 2025
రంగారెడ్డి జిల్లా నిరుద్యోగులకు ఫ్రీ ట్రైనింగ్

చిల్కూర్‌లో SBI రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ కింద యువతకి సీసీటీవీపై ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఉమ్మడి రంగారెడ్డికి చెందిన 18- 45 ఏళ్లలోపు పురుషులు చిల్కూర్ SBI శిక్షణ కేంద్రంలో పేరును నమోదు చేసుకోవాలని అధికారులు కోరారు. డిసెంబర్ 9 నుంచి ఉచిత శిక్షణతో పాటు, ఉచితంగా హాస్టల్ వసతి, భోజన సౌకర్యం, యూనిఫామ్, టూల్ కిట్ ఇస్తారు. వివరాల కోసం 8500165190లో సంప్రదించగలరు.
News December 6, 2025
రంగారెడ్డి: ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ రంగారెడ్డి జిల్లాలో శుక్రవారంతో ముగిసింది. చివరి విడతలో స్వీకరించిన నామినేషన్లను నేడు పరిశీలించనున్నారు. ఈనెల 9వ తేదీ వరకు ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పించారు. మూడో విడతలో 174 గ్రామపంచాయతీలకు, 1598 వార్డులకు అధికారులు నామినేషన్లను స్వీకరించారు. కాగా, జిల్లావ్యాప్తంగా 526 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.


