News July 11, 2024

HYD: JOBS.. దరఖాస్తుకు నేడే చివరి తేదీ

image

HYDలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా, బీకాం, బీబీఎం పాసై 28 ఏళ్ల వయసు మించని వారు అర్హులు. పోస్టును అనుసరించి రూ.21,500 నుంచి రూ.90,000 జీతం ఉంటుంది. జులై 11 దరఖాస్తుకు చివరి తేదీ. మరిన్ని వివరాలకు https://bel-india.in/job-notifications/ వెబ్‌సైట్‌ చూడండి. SHARE IT

Similar News

News December 16, 2025

ఈనెల 18 వరకు జిల్లాలో ఆంక్షలు అమలు: SP

image

మెదక్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 18 వరకు బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు. ఆదేశాల ప్రకారం నలుగురు, అంతకంటే ఎక్కువ గుంపులుగా చేరడం, ర్యాలీలు, సమావేశాలు, సభలు నిర్వహించడం పూర్తిగా నిషేధమన్నారు. నిబంధనలు ఉల్లంఘించి నిర్వహిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

News December 15, 2025

చేగుంట శివారులో మృతదేహం గుర్తింపు

image

మెదక్ జిల్లా చేగుంట గ్రామ శివారులోని రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. రైల్వే స్టేషన్ పక్కన ఉన్న బాలాజీ వెంచర్‌లో సుమారు 50 ఏళ్ల వయసున్న వ్యక్తి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి విచారణ చేపట్టారు. మృతుడు ఎవరు, ఎలా మరణించాడు అనే వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

News December 15, 2025

జిల్లాను ఓటింగ్‌లో టాప్‌లో ఉంచాలి: కలెక్టర్

image

శత శాతం ఓటింగ్‌లో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. గత విడత ఎన్నికల్లో రాష్ట్రంలో మెదక్ జిల్లా 5వ స్థానంలో ఉందని గుర్తు చేశారు. మూడో విడత ఎన్నికల్లో ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని ఆదేశించారు.